గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున పోటీ చేసిన సీనియర్ నేత, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును వైసీపీ పక్కన పెట్టిందనే న్యూస్ ఈ మధ్యకాలంలో తెగ చక్కర్లు కొడుతోంది. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ నేత రామనాథం బాబు తిరిగి పార్టీలోకి రావడంతో… జగన్ ఇక దగ్గుబాటిని పక్కనపెట్టినట్టే అనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ కార్యకర్తలు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి.. నియోజకవర్గ ఇంచార్జ్‌గా దగ్గుబాటి వెంకటేశ్వరరావును కొనసాగించాలని కోరారు. రామనాథం బాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అయితే దగ్గుబాటి విషయంలో జగన్ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు మంత్రి. సీఎం జగన్‌పై పురందేశ్వరి విమర్శలు చేయడం బాధించిందని ఆయన అన్నారు. ఒకవేళ పురందేశ్వరి వైసీపీలోకి వస్తే రాజ్యసభ ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు మంత్రి వారికి తెలిపారు. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది దగ్గుబాటి వెంకటేశ్వరరావేనని తేల్చిచెప్పారు మంత్రి బాలినేని. రాజకీయంగా కొంతకాలం నుంచి సైలెంట్‌గా ఉన్న పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏమి చేయనున్నారు అనేది ఆసక్తి కరంగా మారింది.
వైకాపాలోకి వస్తే పురంధేశ్వరికి రాజ్యసభ సీటు-బాలినేని
Related tags :