ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. ఈ నొప్పి నుంచి ఉపశమనం కోసం చాలా మంది స్టెరాయిడ్ ఇంజక్షన్లను తీసుకొంటారు. అయితే వీటి వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయని బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటితో సమస్య తగ్గకపోగా కీళ్లు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తాము జరిపిన పరిశోధనల్లో దాదాపు 8ు మందిలో ఈ లక్షణాలను కనుగొన్నట్లు చెప్పారు. స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకోవడంపై మరిన్ని పరిశోధనలు జరగాలని చెప్పారు.
కీళ్ల నొప్పి ఇంజెక్షన్లతో దుష్పరిణామాలు

Related tags :