పేగులో బ్లాక్స్ ఏర్పడడానికి కారణాలు చాలా ఉంటాయి. కడుపులో పేగులు సాధారణంగా 10 నుంచి 12 వారాల వయసులో తయారవుతాయి. ఇలా పేగు తయారయ్యేటప్పుడే దానిలో బ్లాక్ ఏర్పడొచ్చు. పేగు మడతపడడం వల్ల గానీ, పేగులోకి జరిగే రక్తసరఫరాలో ఇబ్బంది కలిగినా ఇలా బ్లాక్ అవుతుంది. ఆ భాగంలో పేగు కుళ్లిపోయి బ్లాక్ ఏర్పడుతుంది. పేగు మొత్తంలో ఎక్కడైనా ఇలా బ్లాక్ ఏర్పడొచ్చు. పెద్ద పేగులో కన్నా కూడా చిన్న పేగులో ఇలా బ్లాక్ ఏర్పడే అవకాశం ఎక్కువ. నికోనియమ్ ఐలియస్ అనే సమస్యతో కూడా బ్లాక్ ఏర్పడుతుంది. ఇది సిస్టిక్ ఫైబ్రోసిస్‌కి సంబంధించిన సమస్య. దీనిలో మల పదార్థం గట్టిగా తయారై పేగును బ్లాక్ చేస్తుంది. కొందరిలో మ్యూకస్ మందంగా ఏర్పడుతుంది. కొందరిలో సాల్ట్ చానల్స్ అబ్నార్మాలిటీ, మరికొందరిలో క్లోరైడ్ చానల్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల మలం చాలా గట్టిగా బరువుగా ఉండి బ్లాక్ ఏర్పడేలా చేస్తుంది. దీనికి కాంట్రాస్ట్ స్టడీ అనే పరీక్ష చేస్తారు. ఈ సమస్యకు ముందుగా మందులే ఇస్తారు. ఎనీమా ఇచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అయినా ఫలితం లేకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు లాపరోటోమీ ద్వారా బ్లాక్ ఎక్కడుందో తెలుసుకుని మలవిసర్జన సాఫీగా సాగడం కోసం పేగుకు పొట్ట నుంచి ఇంకో దారి చేస్తారు. ఆరు నెలల తర్వాత ఈ కొత్త దారిని మూసివేయవచ్చు. ఇకపోతే పుట్టేటప్పుడు రక్తసరఫరా సమస్య వల్ల బ్లాక్ ఏర్పడితే ఆ బ్లాక్ వరకు తీసేసి మిగిలిన పేగు భాగాలను తిరిగి అతికిస్తారు. చికిత్స తరువాత చాలావరకు సమస్య పోతుంది. అయితే చిన్నపేగు కనీసం 40 సెం.మీ. ఉండాలి. అలాగైతేనే జీర్ణసమస్యలు రావు. కాని కొందరిలో 15 సెం.మీ. మాత్రమే మిగులుతుంది. ఇలాంటప్పుడు ఐవి ద్వారా టోటల్ పేరెంట్రల్ న్యూట్రిషన్ ఇస్తారు. నెమ్మదిగా సమస్య కుదుటపడుతుంది. అరుదుగా ఎవరో ఒకరిలో చిన్న పేగు ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన అవసరం రావొచ్చు. పేగుకి నరం సమస్య ఉండడం వల్ల కూడా బ్లాక్ ఏర్పడొచ్చు. ఇలాంటప్పుడు ఏర్పడేదాన్ని ఫంక్షనల్ బ్లాక్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పుట్టిన మూడో రోజు వరకు పిల్లలు మలవిసర్జన చేయరు. దీన్ని హర్ష్ప్రంగ్ డిసీజ్ అంటారు. దీనికి ఎనీమా టెస్ట్ చేస్తారు. కొల్లాస్టనీ లేదా ఎండోరెక్టల్ పుల్త్రూ ద్వారా సర్జరీ చేస్తారు. ఆ తరువాత చాలావరకు నార్మల్ అవుతారు.
పసిపిల్లలకు పచ్చ వాంతులు అవుతున్నాయా?
Related tags :