మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వార్షిక వేతనం 2019 ఆర్థిక సంవత్సరంలో 66 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఆయన 42.9 మిలియన్ల డాలర్ల వేతనాన్ని ఆర్జించారు. సాధారణ వేతనం మిలియన్ డాలర్లు పెరగడంతో పాటు ఈయన వంతు కేటాయించే షేర్లు కూడా పెరిగాయి. ‘నాదెళ్ల వ్యూహాత్మక నాయకత్వంతో పాటు వినియోగదారులను ఆకట్టుకోవడంతో కంపెనీ స్థితిగతులే మారిపోయాయి. ఆయన రాకతో సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది’ అంటూ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్లు ప్రశంసించారు. 2014లో సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు 84.3మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు. ఇప్పటి వరకు అదే ఆయన అందుకున్న అత్యధిక వేతనం. ప్రస్తుతం ఆయన ఖాతాలో 9లక్షల షేర్లు ఉన్నాయి. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సగటున 1,72,512 డాలర్ల వేతనం అందుకున్నారు.
నాదెళ్ల జీతం భారీగా పెరిగింది
Related tags :