WorldWonders

₹కోటి రూపాయిల సముద్ర జలగలు స్వాధీనం

1Crore Worth Sea Leecheses Seized By TamilNadu Police

రామేశ్వరం నుంచి శ్రీలంకకు తరలిస్తున్న రూ.కోటి విలువైన సముద్రపు జలగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరం సముద్ర తీరం నుంచి పడవలో జలగలు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రామేశ్వరం పులిదేవన్‌నగర్‌ ప్రాంతంలో ఓ తోటలో మూడు ప్లాస్టిక్‌ క్యాన్లలో 150 కిలోల సముద్ర జలగలు దాచి ఉంచినట్లు గుర్తించారు. వాటిని శ్రీలంకకు తరలించేందుకు అక్కడ ఉంచినట్లు తెలిసింది. దీనికి సంబంధించి రామేశ్వరం పులిదేవన్‌నగర్‌కు చెందిన మురుగేశన్‌(37), మురుగయ్య(61), శక్తివేల్‌(35)ను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న సముద్రపు జలగల విలువ రూ.కోటి ఉంటుందని తెలిపారు.