Politics

పుకార్లు నమ్మకండి. నేను తెదేపాలోనే.

Devineni Avinash Calls On Rumors About Him Leaving TDP

తెదేపాలో తన ఎదుగుదల ఓర్వలేని కొందరు పనిగట్టుకుని తాను పార్టీని వీడనున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈవదంతులు నమ్మవద్దని పార్టీ కార్యకర్తలు, అభిమానులను కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతానని, దేవినేని నెహ్రూ ఆశయాల సాధనకు పాటుపడతానని అవినాష్‌ వెల్లడించారు. తెదేపా కార్యకర్తలు, దేవినేని అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో అవినాష్‌ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే.