Business

ఆలస్యమైనందుకు ₹250 తిరిగిచ్చిన IRCTC

IRCTC Refunds 250Rupees For 451 Passengers For Delayed Trains

మన రైళ్లు ఆలస్యంగా తిరగడం మామూలు విషయమే.. అయినా ఎప్పుడు వినని విధంగా రైలు ఆలస్యం అయినందుకు ప్రయాణికులకు పరిహారం ఇవ్వడం చర్చగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 4వ తేదీన దేశంలోనే తొలిసారి.. తొలి కార్పొరేట్ ట్రైన్ తేజాస్‌ పట్టాలెక్కింది. లక్నో – న్యూ ఢిల్లీ మధ్య నడిచే తేజాస్ ట్రైన్.. ఇవాళ 2 గంటలు ఆసల్యంగా నడిచింది. దీంతో.. ఇక ప్రయాణికులంతా ఆశ్చర్యపోయే విధంగా.. ఒక్కో ప్రయాణికుడికి కంపెన్సేషన్ కింద ఐఆర్‌సీటీసీ ద్వారా రూ.250 చెల్లించింది. ఇవాళ ట్రైన్ 2 గంటలు ఆలస్యమైనందుకు గాను  కంపెన్సేషన్ చెల్లిస్తున్నామంటూ ప్రయాణికులు మెసేజ్ పంపించింది ఐఆర్‌సీటీసీ. మొత్తానికి రూ.250 చొప్పున…దాదాపు 451 మంది ప్రయాణికులకు పరిహారం దక్కినట్టు తెలుస్తోంది.