Politics

వైజాగ్‌లో 3న పవన్ ర్యాలీ

Pawan Kalyan Huge Rally In Vizag on Nov 3rd

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. నవంబర్‌ 3న ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఉపాధి లభించక భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న అంశంపై ఈ ర్యాలీ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు దీన్ని ప్రారంభించనున్నారు. అయితే ర్యాలీ ఎక్కడి నుంచి ప్రారంభించాలనే విషయంపై స్థానిక నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు జనసేన పార్టీ వెల్లడించింది. మంగళగిరిలో జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఈ ఉదయం ప్రారంభమైన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు.