నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. గౌతమ్ తిన్నూరి దర్శకుడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాని బాలీవుడ్‌లో తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, దిల్‌రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ‘జెర్సీ’ రీమేక్‌కు గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహించనున్నారు. ‘కబీర్ సింగ్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం రష్మిక మందనాను సంప్రదించిందట. ‘జెర్సీ’ కథ నచ్చడంతో ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి కనబరిచారట. అయితే వచ్చేనెల నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్న నేపథ్యంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్రబృందం మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
నానితో నా వల్ల కాదు
Related tags :