జీవితం అమూల్యమైంది. అంత విలువైన జీవితాన్ని విలువలతో బతకాలి అంటారు ప్రభువు. ఎవరూ అర్ధంతరంగా తమను తాము కోల్పోకూడదని ఆయన కొన్ని ఉపమానాల ద్వారా చెప్పారు. వంద గొర్రెల్లో ఒకటి తప్పిపోయినా దాని కోసం ఆ కాపరి పడే ఆరాటం, పది నాణేలున్న ఓ పేద స్త్రీ అందులో ఒకటి చేజారిపోతే దాన్ని దక్కించుకునేందుకు ఆమె పడే ఆతృత పోగొట్టుకున్న దాని విలువను వివరిస్తాయి. ఈ సందర్భంగా ప్రభువు చెప్పిన ఓ విషయం ‘ఈ చిన్న వారిలో ఒకరైనా నశించుట పరలోక తండ్రి చిత్తం కాదు’… అంటే ప్రతి జీవినీ భగవంతుడు చల్లగా చూస్తాడని చెప్పారు. ప్రభువు దృష్టిలో ప్రతి ఆత్మా ప్రశస్తమైందే, విలువైందే.
పరలోక తండ్రికి అందరూ సమానమే
Related tags :