తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై తెరాస నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బయటకు పంపించాలని తెరాస కోరింది. కోదాడకు చెందిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచార గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ హుజూర్‌నగర్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఉత్తమ్‌పై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ చర్యలు తీసుకోవడం లేదని తెరాస నేతలు ఆక్షేపించారు.
ఉత్తమ్‌ను హుజూర్‌నగర్ నుండి పంపండి
Related tags :