DailyDose

మోడీతో అమోల్ భేటి-వాణిజ్య-10/21

Flight Maker Amol Meets Modi-Business News Today-10/21

*భారత ప్రధాని నరేంద్ర మోడీని మహారాష్ట్రకు చెందిన పైలెట్ అమోల్ యాదవ్ కలిశారు. దేశంలోనే తోలి విమాన తయారీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు అమోల్ యాదవ్ గతేడాది ఒ భారీ ప్రాజెక్టుఫై ఒప్పందం చేసుకున్నారు.
*స్వీడన్ కు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల సంస్థ వోల్వో తన తోలి ఎలక్ట్రిక్ కారు ఎక్స్పీ 40 రీచార్జ్ ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది.
* అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాను వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. వచ్చే నెలలో మరో దఫా ప్రణాళికను ప్రకటించబోతున్నది.
* తమ గృహ రుణాల వెబ్‌సైట్‌ ఇంగ్లీ్‌షతో పాటు ఇకపై ఆరు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుందని హెచ్‌డీఎ్‌ఫసీ ప్రకటించింది. తద్వారా ప్రాంతీయ వినియోగదారులు కూడా రుణాలకు సంబంధించిన వివరాలను సులభంగా అర్థం చేసుకునే వీలు కల్పించామని పేర్కొంది.
* బీమా సంస్థలు రూపొందించే ప్రకటనల్లో ఏ విధమైనటువంటి తప్పుడు సమాచారం ఉండరాదని ఇన్సూరెన్స్‌ రెగులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) సూచించింది. నిబంధనలపై వినియోగదారులకు ముందుగానే ఆయా సంస్థలు స్పష్టతనివ్వాలని తెలిపింది.
* ఈ-కామర్స్‌ దిగ్జజ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తమ టాప్‌ 5 విక్రేతల వివరాలతో పాటు వారి ఉత్పత్తులపై విధిస్తున్న చార్జీల జాబితా, వారికి సంస్థల తరపున ఇస్తున్న మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు ఇవ్వాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐఐటీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు సంస్థలకు విడివిడిగా ప్రశ్నపత్రాలను పంపించింది.
* ఇంటర్‌కనెక్ట్‌ యూసేజీ చార్జీ (ఐయూసీ)పై డెడ్‌లైన్‌ను పొడిగించాలన్న టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) నిర్ణయం.. ప్రధానమంత్రి ప్రారంభించిన డిజిటల్‌ ఇండియాకు తూట్లు పొడవటమేనని రిలయన్స్‌ జియో ఆరోపించింది. కొంతమంది పాత ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం పెట్టుబడిదారుల స్థైర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
* చైనా స్మార్ట్‌ ఫోన్ల కంపెనీ హానర్‌ ఈ ఏడాది చివరిలోగా దేశీ మార్కెట్లోకి తన ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలనుకుంటోంది. అమెరికా కంపెనీల నుంచి సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ విడిభాగాలను కొనుగోలు చేయ రాదంటూ తన మాతృసంస్థ హువేపై నిషేధం విధిం చినప్పటికీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు హానర్‌ ప్రకటించడం విశేషం.
* ప్రభుత్వరంగంలోని ఎయిర్‌ ఇండియాలో పూర్తిగా వాటాలను విక్రయించే ప్రయత్నంలో భాగంగా వచ్చే నెల నుంచి ప్రాథమిక బిడ్స్‌ను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కంపెనీలో వాటాలను తీసుకునేందుకు ఇప్పటిఏ కొన్ని కంపెనీలు ఆసక్తిని వ్యక్తపరిచాయి
* చైనాకు బదులు భారత్‌ను తమ పెట్టుబడులకు కేంద్రంగా చేసుకోవాలనుకునే కంపెనీలను స్వాగతిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.
* ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కేజీ బేసిన్‌ నుంచి మరింత గ్యాస్‌ ఉత్పత్తి చేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) సిద్ధమవుతోంది. ఈ బేసిన్‌లోని ఆర్‌-క్లస్టర్‌ నుంచి వచ్చే ఏడాది జూలై నాటికల్లా గ్యాస్‌ ఉత్ప త్తి ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.