అమెరికాకు చెందిన మోటారుసైకిళ్ల తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని మళ్లీ ప్రారంభించింది. ఈ కంపెనీ లైవ్‌వైర్ పేరుతో తయారు చేసే బైకుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఛార్జింగ్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఈ బైకు ఓనర్లు సమస్య తీరే వరకు కేవలం డీలర్ కార్యాలయాల్లో మాత్రమే ఛార్జింగ్ చేసుకోవాలని పేర్కొంది. సమస్యను మాత్రం హార్లీ బహిర్గతం చేయలేదు. కాకపోతే అన్ని బైకుల్లో ఈ సమస్యలేదని కేవలం ఒకదానిలో మాత్రమే గుర్తించినట్లు పేర్కొంది. ‘‘గతంలో నిలిపివేసిన లైవ్‌వైర్ బైకుల ఉత్పత్తిని ప్రారంభించాము. ఒక్క బైకులోనే సమస్యను గుర్తించాము.ఈ వారంలో పరిస్థితిని పూర్తిగా విశ్లేషించాము. మేము లైవ్‌వైర్ ప్రొడక్షన్, డెలివరీలను పునరుద్ధరించాము’’ అని హార్లీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
హార్లీ విద్యుత్ బైకులు తయారీ పునఃప్రారంభం
Related tags :