DailyDose

కేసీఆర్ ఇంటి ముందు రేవంత్ అరెస్టు-నేరవార్తలు–10/21

Revanth Reddy Enters Pragati Bhavan On Bullet. Gets Arrested-Telugu Crime News-10/21

*బుల్లెట్ పై ప్రగతి భవన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి.!అరెస్టు.!ప్రగతి భవన్ బద్దలు కొడతాం. రేవంత్ రెడ్డి.
* కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌లో బాక్స్‌ పేలింది. ఈ ఘటనలో హుస్సేన్‌ సాబ్‌ నాయక్‌వాలె అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పేలుడు ధాటికి స్టేషన్ లో ఆవరణలో ఉన్న అద్దాలు పగిలిపోయాయి. హుస్సేన్‌ పట్టుకెళ్తున్న బాక్స్‌ పేలి ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పేలిన బాక్స్‌ కాన్పూర్‌ ఎమ్మెల్యే పేరుతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న బాంబు స్కాడ్‌ బృందాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
* విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జంక్షన్ కూడలిలో రైల్వే గేటు ఎదురుగా ప్రమాదం.
విశాఖపట్నం నుంచి కొత్తవలస వస్తున్న లారీ ప్రమాదవశాత్తు టైరు పేలడంతో ఒక్కసారిగా టైర్ యొక్క రిమ్ము తగిలి పక్కనుంచి హెల్మెట్ ధరించి బండిపై వెళ్తున్న వ్యక్తి మృతి.కొత్తవలస మండలం ముషిరం గ్రామంనకు చెందిన పిల్లా అచ్చిబాబు గుర్తింపు .మృతునికి ముగ్గురు పిల్లలు 1 అబ్బాయి, 2 ఆడపిల్లలు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు * జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండల కేంద్రం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గోనెపల్లి శేఖర్‌గౌడ్‌ పెద్ద కొడుకు గోనెపల్లి యశ్వంత్‌గౌడ్‌, ఠాకూర్‌ సైలెందర్‌సింగ్‌లు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.
* మన్యంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.  లక్షలు ఉంటుందన్నారు. ముంచంగిపుట్టు మండలం కిలగాడ వద్ద బోలెరో పిక్ అప్ వ్యానులో తరలిస్తున్న  కేజీల గంజాయిని పట్టుకున్నారు. పాడేరు ప్రొహిబిషన్అనకాపల్లి టాస్క్ ఫోర్స్ఎక్సయిజ్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. గంజాయిని పాడేరు ఎక్సయిజ్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
*హిందూ సమాజ్ పార్టీ చీఫ్ కమలేశ్ తివారీ దారుణ హత్య జరిగి నాలుగు రోజులు కూడా కాకముందే దుండగుల నుంచి మరో ప్రముఖ నేతకు బెదిరింపులు మొదలయ్యాయి. ‘‘తర్వాత చంపబోయేది నిన్నే’’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తర ప్రదేశ్‌లోని నవ నిర్మాణ సేన నేత అమిత్ జానీకి బెదిరింపు లేఖ పంపారు. ‘‘కమలేశ్ తివారీ తర్వాత నోయిడాలో నువ్వే…’’ అని అందులో పేర్కొన్నారు. నోయిడాలోని అమిత్ జానీ నివాసం వద్ద సెక్యురిటీ గార్డుకు ఓ గుర్తు తెలియని మహిళ సీల్ చేసిన ఎన్వలప్ కవర్ ఇచ్చివెళ్లినట్టు సమాచారం. దీంతో వెంటనే అమిత్ జానీ పోలీసులకు ఈ లెటర్ అందించి, కేసు పెట్టారు.
*ఎల్బీనగర్ చౌరస్తాలోని షైన్ పిల్లల వైద్యశాలలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఎమర్జెన్సీ వార్డులో భారీ అగ్నిప్రమాదం.
ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు అందులో ఒక చిన్నారి మృతి ఆస్పత్రి హాస్పిటల్ దగ్గర తల్లిదండ్రుల ఆందోళన పరిస్థితి ఉద్రిక్తం రంగంలోకి దిగిన పోలీసులు అధికారులు. హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేసి మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది..
*హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.అరెస్టు చేసిన నేతలను హైదరాబాద్ చుట్టూ ఆపకుండా తిప్పుతున్న పోలీసులు. సాయంత్రం వరకు నేతలను హైదరాబాద్ రౌండప్ తిప్పనున్నట్లు సమాచారం. ప్రగతి భవన్ తో దగ్గరికి మూడు బ్యాచ్ లు ముట్టడిగి ప్రయత్నం. ప్రగతి భవన్ తో పాటు..నాలుగు కిలోమీటర్ల వరకు అన్ని సర్కిల్స్ లో భారీగా పోలీసుల మోహరింపు..
*శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు, తనిఖీ చేయగా బయటపడ్డ బంగారం. శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం
విమానం దిగి ఎయిర్ పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్నఈ వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద భారీ ఎత్తున బంగారం లభించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని విదేశాల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
*ఖమ్మం పట్టణ రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం.జయమ్మ(45) విషజ్వరంతో మృతిచెందారు. గత పది రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్న జయమ్మను సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైకోర్టు విభజనలో భాగంగా జయమ్మ సత్తెనపల్లి కోర్టు నుంచి ఖమ్మంకు బదిలీపై వచ్చారు. జయమ్మ మృతికి సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు విచారం వ్యక్తం చేసి మౌనం పాటించారు. జయమ్మ స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం అయోధ్యనగర్‌. జయమ్మకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు
* విశాఖ జిల్లా అనకాపల్లి లో రౌడీ షీటర్ రాజేష్ హత్యపలు నేరాలలో బెయిల్ మీద బయట ఉన్న రాజేష్
ఈ హత్యకు కారణం పాత కక్షలే అన్న అనుమానం
* తెల్లవారుజామున విజయవాడ గుణదల సమీపంలో డివైడర్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. రాజమహేన్ద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ప్రమాదం.క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్,ఆయుష్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం.
* హైదరాబాద్‌ నగరంలోని ఎల్బీనగర్‌ షైన్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి వెళ్లి సహాయ చర్యలు ప్రారంభించారు.
* ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బన మండలం తక్కలపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో చంద్రపూర్‌కు చెందిన ఈసం పెళ్లివార్ వత్సల(60) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.