*ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి చెందిన పలువురు సిట్టింగ్‌లు, ముఖ్య, కీలకనేతలు ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పిన నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆదినారాయణరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. తేదేపాకు చెందిన కడప జిల్లా జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డి ఈరోజు సిఎం జగన్ ను కలిశారు.
*నువ్వు సిద్ధమా శకుని మామా ? – టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియకుండానే రాష్ట్ర ప్రజలకు నవరత్నాయిల్ రాసారా శకుని మామా?అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే మోదీ మెడలు వంచుతాం, కేంద్రాన్ని కడిగేసి రాష్ట్ర ఖజానా నింపుతాం అన్నారుగా నువ్వు,మీ తుగ్లక్ గుర్తుందా?తీరా మీకు 22 ఎంపీలని ఇస్తే రాష్ట్రం కోసం పోరాడాల్సింది మానేసి మీ కేసుల మాఫీ కోసం వంగి వంగి దండాలు పెడుతూ ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టేసారు కదా శకుని మామా ! పైగా రాష్ట్ర ఆర్ధిక స్థితి అప్పులు అంటూ మంగళవారం కబుర్లోకటి !!మడమ తిప్పామ్,మాట మార్చామ్ అని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబితే, మీ మహమేత హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబు చేసిన అప్పులు సృష్టించిన సంపద పై నీతో చర్చకు నేను సిద్ధం.
*రివర్స్ టెండరింగ్‌తో జలవనరుల శాఖలో ఇప్పటివరకు రూ.1000 కోట్ల ఆదాయం తెచ్చామని మంత్రి అనిల్‌కుమార్ చెప్పారు. రివర్స్ టెండరింగ్ తీసుకురాకపోతే ఈ మొత్తంమంతా కొంతమంది జేబుల్లోకి వెళ్లేదని ఆరోపించారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపడుతుంటే తెదేపా నేతలు ఓర్వలేకపోతున్నారనీ.. నిరంతరం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి వరదల వల్లే నదుల్లో ఇసుక తవ్వలేకపోతున్నామన్నారు. రాష్ట్రంలో కొరత త్వరలోనే తీరుతుందని చెప్పారు. రివర్స్ టెండరింగ్‌తో వలిగొండలో రూ.62 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన మొత్తాన్ని ఏవైనా సంక్షేమ కార్యక్రమాలకైనా.. కట్టడాల నిర్మాణాలకైనా వాడొచ్చన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అవుతుంటే ఏ పనులూ చేయలదని విమర్శలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కూడా ఏ ప్రాజెక్టునూ తీసుకున్న దాఖలాల్లేవన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తున్నారని అనిల్ వెల్లడించారు.
*విశాఖ చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు
శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం హైదరాబాదు నుండి స్పైస్ జెట్ విమానంలో విశాఖ చేరుకున్నారువిమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన శ్రీకాకుళం ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరిన చంద్రబాబు.శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు రేపు నియోజకవర్గాల వారీగా నాయకుల తోటి కార్యకర్తలతో సమీక్షలు జరుపుతారని పార్టీ వర్గాల సమాచారం.సమీక్ష అనంతరం రేపు రాత్రికి విశాఖ చేరుకొని హైదరాబాద్ పయనమవుతారు
* నేను తప్పు చేయలేదు.. భయపడను: చంద్రబాబు
‘నేను తప్పు చేయలేదు.. ఎవరికీ భయపడను’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం నాడు బాబు శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కార్యకర్తల త్యాగాలు మరిచిపోలేనని.. కార్యకర్తల ప్రాణాలకు తన ప్రాణం పణంగా పెడతానన్నారు. ‘నేను తప్పు చేయలేదు.. భయపడను. జగన్ తండ్రి 26 కేసులు వేశారు.. ఏం సాధించారు?. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తాం. గ్రామ స్థాయి నుంచి సమర్ధవంతమైన నాయకత్వం రావాలి.
* బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనే..
ఈవీఎంల్లో ఏ బటన్ నొక్కినా ప్రతి ఓటూ పాలక పార్టీకే వెళుతుందని హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఓ బీజేపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యాఖ్యలు చేసి ఈసీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే బక్షిత్ సింగ్ విర్క్‌ను ఉద్దేశిస్తూ బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనేనని రాహుల్ వ్యాఖ్యానించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుండగా రాహుల్ ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు.
* గవర్నర్ తమిళిసైని కలిసిన వీహెచ్‌పీ నేతలు
గవర్నర్ తమిళిసైని వీహెచ్‌పీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో వీహెచ్‌పీ కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించామని ఆపార్టీ నేత రామరాజు చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై పువ్వాడ అజయ్‌తో, కార్మికసంఘాల నాయకులతో మాట్లాడామన్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం చొరవచూపి కార్మికులను త్వరగా చర్చలకు పిలవాలని ఆయన కోరారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని పోరాడి తమ డిమాండ్లను సాధించుకోవాలన్నారు.
టీడీపీకి షాక్. ఆది భాజపాలోకి జంప్-రాజకీయం–10/21
Related tags :