అందం…ఖరీదైన క్రీముల్లో ఉండదు. వంటింట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనూ మెరిసిపోవచ్ఛు అదెలా అంటే!
* రెండు టేబు్ స్పూన్ల బియ్యప్పిండిలో అంతే పరిమాణంలో టీ డికాక్షన్, టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కొంటే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.
* టేబుల్ స్పూన్ పాలపొడిలో, కొద్దిగా కీరదోస రసం, చెంచా పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మంపై యాక్నే మచ్చలు, నలుపుదనం తొలగిపోతాయి.
* ముప్పావు కప్పు గులాబీ నీటిలో, పావు కప్పు గ్లిజరిన్, ఒక టేబుల్ స్పూన్ చొప్పున వెనిగర్, తేనె కలిపి సీసాలో భద్రపరచండి. దీన్ని సన్‌స్క్రీన్ లోషన్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.