ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దామోదర నాయుడికి బెయిల్ మంజూరైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగి మురళీకృష్ణను ఏప్రిల్ 12న విధుల నుంచి తొలగించారు. తనను ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవాలని వైస్ ఛాన్సలర్‌కు విన్నవిస్తున్నప్పుడు కులం పేరుతో దూషించారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 24న కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు.. ఆదివారం వీసీని అరెస్ట్ చేశారు.
ఎన్జీ రంగా యూనివర్శిటీ వీసీకి బెయిల్
Related tags :