Health

సోలో లైఫ్‌తో సడెన్ డెత్

Unmarried Males Prone To Sudden Deaths

ఇదేదో స్లోగన్‌ అనుకుంటే పప్పులో కాలేసినట్టే! చాలామంది ఒంటరిగా జీవించడమే బెటరని భావిస్తుంటారు. ఈ ఆలోచన మగవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనే పురుషుల జీవితకాలాన్ని తగ్గిస్తుందన్న విషయం ఇటీవలి అధ్యయనంలో స్పష్టమైంది. ఒంటరిగా జీవించే మగవారు అరవై సంవత్సరాలకి మించి జీవించరని అధ్యయనకారులంటున్నారు. ఒంటరిగా ఉండే మగవారి ఆయుష్షు తగ్గడానికి రకరకాల కారణాలను వారు గుర్తించారు. నలభై సంవత్సరాలు పై బడిన తరువాత పురుషులలో ఆరోగ్యం మీద ఆసక్తి సన్నగిల్లుతుందనీ, పెళ్ళయిన వారిలో భార్యలే భర్తల ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారనీ, అదే ఒంటరిగా ఉండే పురుషుల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునేవారు లేక వారు అకాల మృత్యువాత పడే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా ఉండడం అంటే రిస్క్‌ తీసుకోవడమే అని వారు స్పష్టం చేస్తున్నారు.