మీడియా పై ఆంక్షలు కేసులు పెట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ వివాదాస్పద జీవో తీసుకురావాలని నిర్ణయించారు. ఈమేరకు కేబినేట్ భేటీలో చర్చ జరిగింది. ఎయితే దీనికి సంబందించిన వివరాలు చాలా గోప్యం. కేబినేట్ నోట్ కూడా గోప్యమే కానీ కేబినేట్ భేటీ పూర్తీ కాగానే ఈ కేబినేట్ నోట్ బయటకు లీక్ అయ్యింది. క్ష ణాల్లోనే సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. నిరాధారమైన వార్తలు రాసే అటువంటి పత్రికలూ ప్రసార సాధనాలపై కేఉస్లు పెట్టె అధికారాన్ని సంబందిత ప్రభుత్వ శాఖ్ కార్యదర్సికు అప్పగించాలని ఆ క్యాబినెట్ నోట్ లో పేర్కొన్నారు. నిజానికి దానిపై నిర్ణయం తీసుకోలేదు. 2007 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇలాంటి జీవోనే తీసుకురాగా అప్పట్లో తీవ్ర వ్యతిరేకత తెలియకుండానే వచ్చిందని వైఎస్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కేబినేట్ నోట్ కూడా అదే విధంగా ఉండటంతో జగన్ కు ఇబ్బందికరంగా మారింది. అసలు ఎలా బయటకు వెళ్ళిందనే దానిపై ఆరా తీయమని ఆయన అధికారుల్ని ఆదేశించారు,. ఎవరికీ వారు తమకు తెలియదని చెబుతున్నప్పటికీ నలుగురైదుగురుపై అనుమానం పెంచుకుని వారిపై నిఘా ఉంచారు. ఈ క్యాబినెట్ నోట్ లీక్ కావడంతో జాతీయ మీడియాలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరిగిందని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రచారం జరిగిందని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా సైతం ఈ నోట్ పై చాలా రచ్చ జరిగింది. అందుకే కుట్ర పూరితంగానే ఈ నోట్ ను లీక్ చేసారని ప్రభుత్వ పెద్దల్లో ఏర్పడింది. అందుకే సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇంకోసారి అలాంటి పనులు చేయడానికి సిద్దపడరని భావిస్తున్నారు. అయితే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరంటారు.మరి జగన్ సర్కార్ లీకు వీరుడ్ని పట్టుకుంటుందో లేదో?
జగన్ క్యాబినెట్లో లీకు వీరుడు ఎవడబ్బా?
Related tags :