DailyDose

బాలుడికి కాపలా ఉండమంటే కడుపు చేయించుకుంది-నేరవార్తలు-10/22

Boy Makes Aunt Pregnant In TamilNadu-Telugu Crime News-10/22

*కుటుంబ బంధాలకే మాయని మచ్చ తెచ్చే ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తల్లిలాంటి చిన్నమ్మతోనే అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తన పెళ్లికి ఎక్కడ అడ్డొస్తుందో అన్న అనుమానంతో ఆమెను హత్యచేశాడు. భర్తకు దూరంగా ఉంటున్న ఆ మహిళ వావివరుసలు మరిచి వరుసకు కొడుకైన వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుని ప్రాణాలు కోల్పోయింది.దిండుగల్‌ జిల్లా వేడచందూర్‌ సమీపం మారంపాడి గ్రామానికి చెందిన తిరావియంకు కొన్నాళ్ల క్రితం అలివేలు అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విబేధాలు రావడంతో అలివేలు పిల్లలతో కలిసి వేర్వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తిరావియం అన్న కుమారుడు పీటర్‌(28)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తనకు తల్లిలాంటిదని తెలిసి కూడా పీటర్ ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు.ఇటీవల పీటర్‌కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇది తెలుసుకున్న అతడి పిన్ని తనతో సంబంధం పెట్టుకుని పెళ్లి ఎలా చేసుకుంటావంటూ అతడిని నిలదీసింది. దీంతో పీటర్ ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం బయటకు వెళ్దామని అలివేలును పీటర్ బైక్‌ ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తాను పెళ్లి చేసుకున్నా అక్రమ సంబంధం కొనసాగిస్తానని పీటర్ చెప్పినా ఆమె అంగీకరించలేదు. తనకు న్యాయం చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని, లేదంటే వధువు తరపువారికి విషయం చెప్పి పెళ్లి ఆపేస్తానని అలివేలు బెదిరించింది.దీంతో పీటర్ తన తమ్ముడు ఆంటోనీ, స్నేహితుడు సుందర్‌కి ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. వారిద్దరూ ఆమెను పట్టుకోగా పీటర్ గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటనను దూరం నుంచి చూసిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అలివేలు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరైన ఆంటోనీని అరెస్ట్ చేయగా, పీటర్, సుందర్ పరారయ్యారు.
* పాకిస్తాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ట్రాన్స్‌జెండర్‌ను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. ఈ దారుణ ఘటన సెప్టెంబర్‌ 20న కామలి నగరంలోని ధూప్‌సారి గ్రామంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* మల్కాజ్‌గిరి, మేడిపల్లి పరిధిలో టీవీల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 లక్షల రూపాయల విలువైన 23 ఎల్‌ఈడీ టీవీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* ప్రకాశంజిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం మార్కాపురం మండలం దరి మడుగు దగ్గర కడప-శ్రీశైలం బస్ బైకును ఢీ కొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్ట్.. ఈ సందర్బంగా లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ విచారణకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది. కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసులో మాత్రమే ఆయనకు బెయిల్ వచ్చింది.. మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కుంటున్నారు. అక్టోబర్ 24వరకూ చిదంబరం ఈడీ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది.. దీంతో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ ఈడీ కస్టడీ గడువు ముగిసేంతవరకు చిదంబరం తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.
* గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చి అనుచరుడు హుమాయున్ మర్చెంట్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఇక్బాల్ మిర్చి అనుచరుడు హుమాయున్‌ను నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
* జమ్మూకశ్మీర్‌లోని బాలాకోట్‌లో పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ జరిపిన భీకర దాడిలో ఇద్దరు స్థానిక మహిళలు గాయపడ్డారు. గాయపడ్డ మహిళలను స్థానిక పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూంచ్ సెక్టార్‌లో స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులకు పాల్పడింది.
* విదేశం నుంచి బయలుదేరిన ఓ మహిళ ఇంటికి చేరే తరుణాన కొడుకుతో సహా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. వాహన చోదకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట సమీపంలో సోమవారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది
* రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి దిగారు. దీంతో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి నుంచి ప్రయాణికులకు తృటిలో తప్పించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ వెళ్తున్న బస్సుపై చేవెళ్ల సమీపంలో దుండగులు దాడి చేశారు. వికారాబాద్‌ డిపో అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*దోహా నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న విమానం శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. అందులో ఉన్న ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో అధికారులకు సమాచారమిచ్చిన పైలట్‌ శంషాబాద్‌లో ల్యాండ్‌ చేశారు. అయితే బాధితుడిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తిరిగి దోహాకు తరలించారు.
*మృత్యువు ఎప్పుడు ఎవరిని ఎలా కబళిస్తుందో చెప్పలేం. అందుకు నిదర్శనమే ఈ ఘటన. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని ముసిరాం గ్రామానికి చెందినపిల్లా అచ్చిబాబు (43)సోమవారం సాయంత్రం మోటార్‌ సైకిల్‌పై బయలుదేరాడు. తలకు రక్షణగా హెల్మెట్‌ కూడా పెట్టుకున్నాడు. కొత్తవలస జంక్షన్‌కు వచ్చేసరికి విశాఖ నుంచి కొత్తవలస వైపు వస్తున్న లారీ ముందు చక్రం టైరు ఒక్కసారిగా పేలింది. ఆ టైరుకు ఇనుపచట్రం గాలిలోకి ఎగిరి, పక్కనుంచే వెళ్తున్న అచ్చిబాబు తలకు ఉన్న హెల్మెట్‌కు బలంగా తగిలింది. హెల్మెట్‌ ముక్క లై పోవడంతో తలకు గాయమై అచ్చిబాబు అక్కడక్కడే మృతి చెందాడు
*మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తతోపాటు మరో పది మందిపై ఈ నెల 1న నమోదైన కేసుల్లో ముగ్గురు నిందితులను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
*అప్పుల బాధతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. లేపాక్షిరెడ్డి (27) తనకున్న మూడెకరాల్లో మూడేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నారు.
*కళాశాలలో జరిగిన గొడవలో తన ప్రమేయం లేకున్నా, యాజమాన్యం తీవ్రంగా వేధిస్తోందంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కళాశాల భవనం ఆరో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో సోమవారం చోటుచేసుకుంది.
*అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని 75 వీరాపురం గ్రామానికి చెందిన ఎర్రిస్వామి (32) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఉదయం వ్యవసాయ పంపుసెట్టు పనిచేయకపోవటంతో ఎర్రిస్వామి మోటారు స్టార్టర్ బాక్స్ను ముట్టుకోగానే విద్యుదాఘాతంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. చికిత్స కోసం ఆయన్ను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
*జైళ్లలో ఆహార పదార్థాలకు వినియోగించే నూనెలో కల్తీ ఉందన్న ఫిర్యాదుతో హైదరాబాద్ డబీర్పురా ఠాణా పోలీసులు దీపక్ అగర్వాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. చంచల్గూడ జైల్లో ఖైదీల ఆహార పదార్థాల కోసం కొనుగోలు చేసిన సన్ఫ్లవర్ నూనెలో కల్తీ ఉందని తేలడంతో జైలు పర్యవేక్షణాధికారి డబీర్పురా ఠాణాలో ఫిర్యాదు చేశారు.
*కర్ణాటక వాణిజ్యనగరి హుబ్బళ్లి రైల్వేస్టేషన్లో సోమవారం పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలవగా స్టేషన్ మాస్టర్ కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం రైల్వేస్టేషన్లో ఓ పెట్టె ఒక్కసారిగా పేలింది.
*రాజీవ్ రహదారి మరోమారు రక్తమోడింది. ఆగి ఉన్న కంటైనర్ను వెనుకనుంచి కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ శివారులో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
*పత్తిపాడు నియోజవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అధికారులు చోద్యంతో ఓ మైనర్ల జంట పెళ్లి చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రత్నగిరి కొండ దిగువన ఆధ్వర్యంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో రాజమండ్రికి చెందిన మైనర్లు వెంకట్ పద్మజ లు పెద్దల అంగీకారం లేకుండా స్వతంత్రంగా పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది.
*అధికారులు వెంబడిస్తుండటంతో.. ఎర్రచందనంతో ఉన్న కారును అర్థరాత్రి వదిలి దుండగులు పరారైన ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఖాజీపేట మండలం అటవీ ప్రాంతం నుండి అధికారులు స్మగ్లర్ల కారును గుర్తించి వెంబడించడంతో.. వల్లూరు మండలం గోటూరు గ్రామం వద్ద ఎర్రచందనంతో ఉన్న కారును లాక్‌ చేసుకుని దుండగలు పరారయ్యారు. కారులో రెండు లక్షల రూపాయల విలువ చేసే 8 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు, అధికారులు కారును కడప కు తీసుకొని వెళ్ళినట్టు సమాచారం.
* ఓల్డ్ బోయిన్ పల్లిలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. మూడు కిలోల బంగారం, 18 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఓల్డ్ బోయిన్ పల్లి లోని మల్లికార్జున నగర్ లో ఈ ఘటన జరిగింది.
* పంచలోహ విగ్రహాలు విక్రయించే  మంది సభ్యులు గల ముఠాను మంగపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా మణుగూరు ప్రాంతం నుంచి మంగపేట మీదుగా వరంగల్‌కు అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకునితనిఖీ చేయగా అందులో నాలుగు కిలోల బరువు ఉన్న అమ్మవారి విగ్రహంమూడు కిలోల బరువు ఉన్న బుద్ధ విగ్రహంరంగురాళ్లువందకుపైగా రాగి నాణేలు లభ్యమయ్యాయి.