కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో ఆయనను బెయిల్ లభించింది. కానీ ఆయన ఈనెల 24 వరకు ఈడీ కస్టడిలోనే ఉండనున్నారు. ఎన్ ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్ధిక మంత్రి పీ.చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సెప్టెంబరు ఐదు నుంచి జ్యుడీసియాల్ కస్టడీలో ఉన్న ఆయనకు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసులో లక్ష రూపాయల పూచీకత్తు మీద ఆయనకు బెయిల్ దొరికింది. కానీ ఈ సీనియర్ కాంగ్రెస్ నేత అక్టోబరు 24 వరకు ఎన్ ఫోర్సు మెంటు డైరెక్టరేట్ కస్టడీలోనే ఉండనున్నారు. దిల్లిలోని తీహార్ జైల్లో నెల రోజులకు పైగా ఉన్న చిదంబరాన్ని గతవారం ఈడీ కస్టడిలోకి తీసుకుంది. ఈడీ కేసులోనూ బెయిల్ వస్తేనే ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న చిన్డంబారానికి ఇంటి నుంచి ఆహారం తెప్పించటానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రత్యెక సెల్, వెస్ట్రన్ టాయిలెట్ కళ్ళద్దాలు మందులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఏసీ సౌకర్యం కల్పించాలని చిదంబరం చేసుకున్న వినతి పట్ల ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రోజుకు అరగంట చొప్పున కుటుంబ సభ్యులు బందువులు కలిసే అవకాశం ఆయనకు కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బెయిల్ ఇచ్చినా బయటకు రాని చిదంబరం
Related tags :