DailyDose

జనసేన ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు-తాజావార్తలు-10/22

Court Notices Sent To Janasena MLA-Telugu Breaking News Today-10/22

* జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికలకు సంబందించి మంగళవారం నోటీసులు జారీ చేసింది. రాపాక గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాజోలు వైకాపా ఇంచార్జి బొంతు రాజేశ్వరరావు హోకిర్తులో పిటిషన్ దాఖలు చేశారు.
* కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి సీబీఐ కేసులో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. చిదంబరంతో పాటు మరో 14మందిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఇదే కేసుకు సంబంధించి చిదంబరం ఈడీ కస్టడీలో ఉన్నారు
* శ్రీశైలం జలాశయం కి పెరుగుతున్న వరద ఇన్ ఫ్లో : 83, 567 క్యూసెక్కులు అవట్ ప్లో : 69 వేల 129 క్యూసెక్కులుజలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం : 215. టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ : 208.7210 టిఎంసిలు.జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885. అడుగులుప్రస్తుతం నీటిమట్టం :883.80 అడుగులు
శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
* పింఛన్‌ పొందడానికి వయోపరిమితిని ఇప్పుడున్న 58 ఏళ్ల నుంచి 60కి పెంచాలని ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) ప్రతిపాదిస్తోంది. పింఛన్‌ను లబ్ధిదారులు పెంచుకునేందుకు వీలుగా ఈ మేరకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. 60 ఏళ్లు వచ్చాక పింఛన్‌ తీసుకునేవారికి కొంత అదనపు బోనస్‌ ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తోంది. నవంబరులో జరిగే కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టనుంది
* సెక్రటేరియట్ కు సోమవారం కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచే బీఆర్కే భవన్ లో కరెంట్ సప్లై బంద్ అయిందని ఉద్యోగులు తెలిపారు.
* బంగ్లాదేశ్‌‌ క్రికెటర్లు సమ్మెకు దిగారు. బంగ్లా క్రికెట్‌‌ బోర్డు (బీసీబీ).. తమ జీతాలు పెంచడం సహా పదకొండు డిమాండ్లను నెరవేర్చేవరకు క్రికెట్‌‌ యాక్టివిటీని బాయ్‌‌కాట్‌‌ చేస్తున్నట్టు తెలిపారు.
* ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్‌ 9న భారత్‌ వైపున కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభిస్తారు. పాకిస్తాన్‌లో నెలకొన్న సిక్కుల గురుద్వారాకు యాత్రికులతో కూడిన తొలి బ్యాచ్‌కు పచ్చజెండా ఊపుతారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో కర్తార్‌పూర్‌ యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన టెర్మినల్‌ వద్ద జరిగే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారు.
* రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ జరిచందన్ ను కలిసిన టిడిపి నేతలురాష్ట్ర ప్రభుత్వం టిడిపి నేతల పై కక్ష సాధింపు చర్య లకు పాల్పడుతుందని ఫిర్యాదు
గవర్నర్ ను కలిసిన వారిలో ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ లు బచ్చుల అర్జునుడు అశోక్ బాబు, దీపక్ రెడ్డి, సత్యనారాయణ రాజు, గిడ్డి‌ఈశ్వరి, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణరావు, ఇతర నాయకులు.
* జమ్మూకశ్మీర్‌లోని బాలాకోట్‌లో పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ జరిపిన భీకర దాడిలో ఇద్దరు స్థానిక మహిళలు గాయపడ్డారు. గాయపడ్డ మహిళలను స్థానిక పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూంచ్ సెక్టార్‌లో స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులకు పాల్పడింది.
* కాపు కార్పొరేషన్‌ రుణాల పాత దరఖాస్తులను ప్రభుత్వం రద్దు చేసింది. గత ఐదేళ్ల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం రద్దు చేసింది. ఇంతకు ముందు కాపు కార్పొరేషన్‌ లోన్లకు దరఖాస్తు చేసిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌ 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది
* కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి సీబీఐ కేసులో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. చిదంబరంతో పాటు మరో 14మందిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఇదే కేసుకు సంబంధించి చిదంబరం ఈడీ కస్టడీలో ఉన్నారు
* మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారనే కారణంతో ఆస్ట్రేలియాకు చెందిన హెరాల్డ్ సన్ అనే దినపత్రిక.. సోమవారం ఎడిషన్‌లో నల్లటి గీతలతో నిరసన తెలిపింది. న్యూస్ కార్ప్ ఆస్ట్రేలియా నెట్‌వర్క్‌కు చెందిన ఈ పత్రిక.. ప్రభుత్వం నిజాలను బయటకు రానీయనప్పుడు.. మీడియా ఏం కవర్ చేయాలని ప్రశ్నించింది. ఆ పేపర్‌తో పాటు మిగతా పత్రికలు కూడా మొదటి పేజీలో నల్లటి గీతలతో ప్రభుత్వ తీరుపట్ల నిరసన వ్యక్తం చేశాయి. ‘నాట్ ఫర్ ది రిలీజ్.. సీక్రెట్’ అని ప్రచురించాయి
* మరో సారి తుంగబధ్ర డ్యాంకు వరద..ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ లోకి భారీగా చేరుతున్న నీరు…2019 సవత్సరంలో ఇది నాలుగో సారి డ్యాం మొత్తం గేట్లు ఎత్తడం…33మూడు గేట్లు ద్వారా రెండు అడుగుల మేరకు లక్ష యాబై వేలు క్యూసెక్కుల నీరు దిగువుకు వదిలిన అధికారులు..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు..తుంగభద్ర నుంచి శ్రీశైలానికి భారీగా చేరుతున్న వరద నీరు…
* తెలంగాణ హైకోర్టు పనివేళల్లో స్వల్ప మార్పులు చేశారు. కొత్త పనివేళల ప్రకారం ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు పనిచేశాక గంటపాటు భోజన విరామం ఉంటుంది. తర్వాత రెండున్నర నుంచి నాలుగున్నర వరకు కోర్టు పనిచేస్తుంది. కొత్త పని వేళలు ఈనెల 28నుంచి అమల్లోకి వస్తాయని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పేర్కొన్నారు.
* ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నేడు వంటావార్పుకు అఖిలపక్షాల పిలుపునిచ్చాయి. ఉదయం 10.30కి జేబీఎస్‌ దగ్గర అఖిలపక్ష నేతల వంటావార్పు నిర్వహిస్తారు. దసరా సెలవుల అనంతరం సోమవారమే విద్యా సంస్థలు పునఃప్రారంభమవడంతో బస్సుల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* దక్షిణ తమిళనాడు, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక, కోమోరిన్‌ ప్రాంతాల నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించింది.
* బంగాళాఖాతంలో ఉన్న నికోబార్ దీవుల్లో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.3గా ఉన్నట్లు భారత వాతావరణశాఖ పేర్కొన్నది. ఇవాళ ఉదయం 6.36 నిమిషాలకు భూమి కంపించినట్లు ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడులో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్ష సూచన కారణంగా.. ఇవాళ రామనాథపురంలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
* నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో (నిమ్స్) బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు రెండో విడుత కౌన్సెలింగ్ ఈ నెల 26న నిర్వహించనున్నట్టు నిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం ఉదయం 10 గంటలకు నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో కౌన్సెలింగ్ జరుగుతుందని, అభ్యర్థులు పూర్తి వివరాల కోసం వ్వ్వ్.నింస్.ఎదు.ఇన్ వెబ్సైట్ను పరిశీలించాల్సిందిగా సూచించారు.
* సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహించింది. ఏషియన్ సినిమా అధినేతలు నారాయణదాష్ నారంగ్, సునీల్ నారంగ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారి సన్నిహితుల ఇండ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయి. నైజాంలో చిత్రాల పంపిణీ, ఏషియన్ థియేటర్లను నారంగ్ నిర్వహిస్తున్నారు
* ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరులను సేకరించాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక నిధులు రాబట్టాలని తీర్మానించింది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధ్యక్షతన సోమవారం బీఆర్కే భవన్లో ఆర్థిక వనరుల సమీకరణ కమిటీ సమావేశం జరిగింది.
* ప్రపంచ సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇంజినీరింగ్ అధ్యాపకులను అన్ని రకాలుగా తీర్చిదిద్దేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) దేశవ్యాప్తంగా శిక్షణ కేంద్రాలను నెలకొల్పనుంది. వీటిని ఏఐసీటీఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (అటల్) అకాడమీగా పిలుస్తారు.
* ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే వారి నుంచి పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందుతాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టంచేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా శాంతిభద్రతలను మరింత సమర్థంగా పరిరక్షించొచ్చన్నారు.
* రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలకు మూణ్నెల్లుగా జీతాలు అందడంలేదు. దీనికితోడు డ్రాయింగ్ పవర్ ఎవరికీ కేటాయించకపోవడంతో జిల్లా పరిషత్లలో అయోమయం నెలకొంది. చిన్నపాటి ఖర్చులు కూడా పాలకులు సొంతంగానే పెట్టాల్సి వస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి పూర్వ జిల్లాపరిషత్కు ఏవైనా లెక్కలకు సంబంధించిన బిల్లులు పంపాలన్నా ఎవరికి పంపాలన్న దానిపై స్పష్టత లేదు.
* రాజధాని అమరావతిలో అంకుర (స్టార్టప్) ప్రాంత అభివృద్ధిపై సింగపూర్ సంస్థల కన్సార్షియం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రతిపాదనలు కోరింది. ఆ ప్రాజెక్టుపై కన్సార్షియం ఎంత పెట్టుబడి పెడుతుంది? అభివృద్ధి ప్రణాళికలేంటి? కన్సార్షియానికి భూమి కేటాయించడంవల్ల సీఆర్డీఏకు ఒనగూరే ప్రయోజనమేంటి? అన్న అంశాలపై నిర్దిష్ట సమాచారాన్ని కోరింది.
* కృష్ణానదికి మళ్లీ వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలకు ప్రవాహం భారీగా చేరుకుని దిగువకు వస్తోంది. ఇప్పటికే కృష్ణా పరీవాహకంలోని జలాశయాల్లో గరిష్ఠ స్థాయి నీటిమట్టం ఉంది. ఈ ఏడాదిలో వరద రావడం ఇది ఆరోసారి. సోమవారం ఆలమట్టి నుంచి 1.20 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 1.82 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
* తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రూ. 300 కోట్లతో 4 జిల్లాల్లో సాంకేతిక కేంద్రాలు (టీసీ), విస్తరణ కేంద్రాలు (ఈసీ) ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), రోబోటిక్స్ వంటి నూతన సాంకేతికతలపై యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ కేంద్రాలను నెలకొల్పుతున్నామని చెప్పారు.
* ప్రస్తుతం హైకోర్టులో అమలులో ఉన్న పనివేళలు ఈనెల 28 నుంచి మారనున్నాయి. ఈమేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పనివేళలు ఉదయం 10.15నుంచి సాయంత్రం 4.15వరకు ఉండగా వాటిని 10.30 నుంచి 4.30గా మార్చుతూ రిజిస్ట్రార్ జనరల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 వరకు భోజన విరామం ఉంటుందని పేర్కొన్నారు.
* దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలకు దగ్గరలో బంగాళాఖాతంలో బుధవారంలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. శ్రీలంక వద్ద కోమరీన్ ప్రాంతం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు అల్పపీడన ద్రోణి ఉందన్నారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించారు. అక్కడి నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితలద్రోణి ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రాజారావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటలవరకు 285 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా కాగజ్నగర్లో 5.9, మొగ్దుంపల్లిలో 5.2సెంటీమీటర్ల వర్షం కురిసింది.
* కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో బదిలీ కోరుకునే వారు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఒప్పంద పద్ధతిపై పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, ఏఎన్ఎంలు, పీఈటీలు దీనికి సంబంధించి పూర్తి వివరాలను వ్వ్వ్.సమగ్రషిక్ష.తెలంగన.గొవ్.ఇన్ ద్వారా తెలుసుకోవచ్చని విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
* ఐఐటీ ఖరగ్పూర్ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సామాజిక, సాంస్కృతికోత్సవమైన స్ప్రింగ్ ఫెస్ట్-2020 వచ్చే జనవరి 24 నుంచి 26వ తేదీ వరకు జరగనుంది. అందులో భాగంగా అయిదు అంశాల్లో హైదరాబాద్ సహా దేశంలోని 11 నగరాల్లో పోటీలు జరుగుతాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. మొత్తం 130 కార్యక్రమాలకు రూ.35 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. మరిన్ని వివరాలకు ఐఐటీ ఖరగ్పూర్ ఫేస్బుక్ పేజీ లేదా వెబ్సైట్ వ్వ్వ్.స్ప్రింగ్ఫెస్త్.ఇన్ ద్వారా తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
* ఇటలీలో ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహించే అంతర్జాతీయ పాడి పశువుల ప్రదర్శన- సదస్సులో తెలంగాణ పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ఎస్.రాంచందర్ పాల్గొననున్నారు. భారత్ నుంచి హాజరవుతున్న ముగ్గురిలో ఈయన ఒకరు.
* హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్మ్యాన్, ఇతర అధికారులు సోమవారం రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
* ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. 18వ రోజైన మంగళవారం కూడా కార్మికుల నిరసనలు కొనసాగాయి. విధుల్లోకి వెళ్లొద్దని తాత్కాలిక సిబ్బందికి కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు
* జమ్ము కాశ్మీర్‌లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కు కాశ్మీర్‌ యువతనుంచి పెద్దయెత్తున స్పందన కనిపించింది. సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహించే టెర్రిటోరియల్‌ ఆర్మీ బెటాలియన్‌లో చేరడానికి 20 వేలమందికి పైగా యువకులు వచ్చారు. జమ్ము కాశ్మీర్‌లోని వివిధ జిల్లాలనుంచి, ప్రత్యేకించి బారాముల్లానుంచి యువత అధిక సంఖ్యలో సైన్యంలో చేరడానికి ఉత్సుకత చూపించారు. రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కు ఆఖరు రోజైన సోమవారంనాడు బారాఉమల్లా జిల్లనుంచి అత్యధిక సంఖ్యలో యువత ఇంటర్వ్యూకు హాజరయ్యారని భారత సైన్యంలోని చినార్‌ కార్ప్స్‌ పేర్కొంది. సైన్యంలో చేరడానికి వచ్చిన వారందరూ మాతృభూమికి సేవ చేయాలనే ఉత్సాహంతో ముందుకు వచ్చారని, తమ ముందు ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని చినార్‌ కార్ప్స్‌ పేర్కొంది.
* లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌నుతీసుకొచ్చింది. ‘లావా జెడ్ 41’ పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది. దీని ధర రూ. 3,899. మిడ్‌నైట్‌ బ్లూ, యాంబర్‌ రెడ్‌ రంగుల్లో ఇది లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలతో వినియోగదారుల అన్ని సోషల్ మీడియా అవసరాలను తీర్చగలదు. యూట్యూబ్ గో వంటి డేటా యాప్ప్‌ సర్ఫింగ్‌కు కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది.
* ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీ పర్యటన వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. హస్తిన పర్యటనలో ఉన్న జగన్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న నిధులు, సమస్యలతో అమిత్‌షాతో చర్చించినట్లు సమాచారం. అమిత్‌షాతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితో జగన్‌ సమావేశం కానున్నారు.
* తెలంగాణలో అద్దె బస్సుల టెండర్లను సవాల్‌ చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖచేసింది. దీనిపై సింగిల్‌ జడ్జి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్టీసీకి బోర్డు అనుమతి లేకుండానే ఇన్‌ఛార్జి ఎండీ టెండర్లు పిలవడం చట్ట విరుద్ధమని పిటిషనర్‌ వాదించారు. సమ్మెను ఓ కొలిక్కి తీసుకురాకుండా శాశ్వత ప్రాతిపదికన అద్దె బస్సులు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ..అర్టీసీ సొంత బస్సులు నడిపే స్థితిలో లేదని అదనపు ఏజీ హైకోర్టుకు తెలిపారు.
* బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కోస్తా, ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. ఇవాళ చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. బుధ, గురువారాల్లోనూ కోస్తా, ఉత్తారాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
* భగవాన్‌ఆధ్యాత్మిక గురువు కల్కిభగవాన్‌ విదేశాలకు వెళ్లిపోయారంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆయన స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, చెన్నైలోనే ఉన్నానని ఓ వీడియో సందేశం ద్వారా స్పష్టం చేశారు. ‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. విదేశాలకు పారిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ఎక్కడికీ వెళ్లలేదు. చెన్నై ‘నేమం’లోనే ఉంటున్నా. ఎప్పటిలాగే ఆశ్రమంలో బోధనా కార్యక్రమాలు జరుగుతాయి. మమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటాం’ అని కల్కి భగవాన్‌ ఆ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.
* తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వాతావరణం రానుంది. రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌, గ్రేటర్‌ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. దీంతో 10 నగరపాలికలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
* ఐఎన్ఎక్స్‌ మీడియా వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఇతర కేసుల్లో అరెస్టు కాని పక్షంలో ఆయన్ని రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయవచ్చని కోర్టు తెలిపింది. అవసరమైనప్పుడల్లా విచారణకు హాజరుకావాలని ఆయన్ను ఆదేశించింది. అయితే ఇదే ఐఎన్ఎక్స్‌ మీడియా వ్యవహారంలో ప్రస్తుతం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
* దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సఫారీసేను టీమ్ఇండియా 3-0తో వైట్‌వాష్‌ చేసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో నాలుగోరోజు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సఫారీసేన రెండు ఓవర్లలోనే ఆలౌటైంది. నదీమ్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో సఫారీసేన రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది.
* ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ప్రధాన అధికారులపై ఆరోపణలు కంపెనీ షేర్లపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీ షేర్లు మంగళవారం కుప్పకూలాయి. నేటి ట్రేడింగ్‌లో ఇన్ఫీ షేరు ధర ఒక దశలో 16శాతానికి పైగా పతనమైంది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీలో 10శాతం నష్టంతో మొదలైన షేరు ధర ఒక దశలో 15.94శాతం విలువ కోల్పోయింది. ప్రస్తుతం కాస్త కోలుకున్నా నష్టాల్లోనే ట్రేడవుతోంది.
* బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత సారథి కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది అతడి ఇష్టమని బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న గంగూలీ పేర్కొన్నాడు. వచ్చేనెలలో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో భారత్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే, విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న కోహ్లీ ఈ టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై దాదా స్పందించాడు. ‘అక్టోబర్‌ 24న కోహ్లీతో చర్చిస్తా. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో టీమ్ఇండియా కెప్టెన్‌తో మాట్లాడతా’ అని స్పష్టం చేశారు.