ఆధ్యాత్మిక గురువు కల్కిభగవాన్ విదేశాలకు వెళ్లిపోయారంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆయన స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, చెన్నైలోనే ఉన్నానని ఓ వీడియో సందేశం ద్వారా స్పష్టం చేశారు. ‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. విదేశాలకు పారిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ఎక్కడికీ వెళ్లలేదు. చెన్నై ‘నేమం’లోనే ఉంటున్నా. ఎప్పటిలాగే ఆశ్రమంలో బోధనా కార్యక్రమాలు జరుగుతాయి. మమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటాం’ అని కల్కి భగవాన్ ఆ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది. కల్కి భగవాన్‌కు చెందిన ఆశ్రమాల్లో ఇటీవల ఆదాయ పన్నుశాఖ పెద్ద ఎత్తున సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో రూ.500కోట్లకు పైగా లెక్కల్లో చూపని సంపద బయట పడింది. కోట్లు విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలోని కల్కి భగవాన్, ఆయన కుమారుడు కృష్ణకు చెందిన 40 ఆశ్రమాల్లో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. అయితే, ఈ సోదాల తర్వాత కల్కి భగవాన్ విదేశాలకు వెళ్లిపోయారంటూ వదంతులు వినిపించాయి.
భక్తుల్లారా….నేను బతికే ఉన్నాను![Video]
Related tags :