Movies

అనుష్క బాటలో కీర్తి

Keerthy Suresh Dedication Is Mesmerizing

`మ‌హాన‌టి`లో జాతీయ ఉత్త‌మ‌న‌టిగా అవార్డును సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్‌. ఈ సినిమా త‌ర్వాత కీర్తిసురేష్‌కి బాలీవుడ్‌లోనూ క్రేజ్ ఏర్ప‌డింది. ఇప్పుడు ద‌క్షిణాది సినిమాల‌తో పాటు కీర్తి .. ఉత్త‌రాదిలోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. సినిమా క‌థ‌ల ఎంపిక‌లోనూ కీర్తి సురేష్ ఎంతో కేర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న చిత్రాల్ల‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే అధికంగా ఉన్నాయి. కాగా.. న‌రేంద్ర‌నాథ్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో కీర్తిసురేష్ చేస్తోన్న చిత్రం `మిస్ ఇండియా` ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బ‌రువు కూడా త‌గ్గింది. సినిమాలో కీర్తి నాలుగు లుక్స్‌లో క‌న‌ప‌డుతుంద‌ట‌. ఈ నాలుగు లుక్స్ కోసం ఈమె దాదాపు 50 లుక్స్ టెస్ట్స్‌లు చేయించుకుంద‌ట‌. న‌టిగా వ‌చ్చిన పేరుని నిల‌బెట్టుకోవ‌డానికి కీర్తి కాంప్ర‌మైజ్ కావ‌డం లేదంటూ అంద‌రూ ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు. గతంలో అనుష్క కూడా ఇలానే బరువు నియంత్రణ ప్రయోగాలు చేశారు. సైజ్ జీరో చిత్రానికి గానూ విపరీతంగా బరువు పెరిగి యోగాతో మళ్లీ సాధారణ బరువులోకి వచ్చారు.