అమెరికా దుకాణాల్లో సిద్ధంగా పండ్లు పేరు కాస్మిక్ క్రిస్ప్..పుట్టింది వాషింగ్టన్‌లో 450 గ్రాముల పండ్లకు రూ.350 ఏడాదైనా ఖరాబ్ కావు మార్కెట్‌లోకి సరికొత్త యాపిల్ రాబోతోంది. అతి పెద్ద మార్కెటింగ్ క్యాంపెయిన్‌తో పరిచయం కాబోతోంది. యాపిల్ అనగానే కొత్త ఫోన్ అనుకోకండి. కొత్తరకం పండు. పేరు కాస్మిక్ క్రిస్ప్. పుట్టింది అమెరికాలో. ఇప్పటికే యూఎస్ మార్కెట్‌లోకి ఈ పండ్లు వచ్చేశాయి. 2020 తొలినాళ్లలో ప్రపంచమంతటా కనిపిస్తాయి. వాషింగ్టన్ స్టేట్‌లో స్టార్ట్ యూఎస్‌లో ఎక్కువగా యాపిల్ పండించేది వాషింగ్టన్ స్టేట్‌లోనే. ఇక్కడ రెండు రకాల వెరైటీ (గోల్డెన్ డెలీషియస్, రెడ్ డెలీషియస్)లను ఎక్కువగా పండిస్తుంటారు. కానీ కొన్నేళ్లుగా వీటి సేల్స్ పడిపోసాగాయి. జనం కొత్త వెరైటీలవైపు మళ్లారు. రాయల్ గాలా, పింక్ లేడీలను ఎక్కువగా కొనడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీటికి పోటీగా ఈ కాస్మిక్ క్రిస్ప్ వచ్చేసింది. 1997లో వాషింగ్టన్ స్టేట్‌లోనే దీని బ్రీడింగ్ స్టార్టయింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో హనీక్రిస్ప్, ఎంటర్‌ప్రైస్‌లను క్రాస్‌బ్రీడ్ చేసి ఈ సరికొత్త యాపిల్‌ను తయారు చేశారు. చల్లని ప్రదేశంలో (ఫ్రిజ్) ఉంచినట్టయితే కనీసం ఏడాది పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. అసలు పేరు డబ్ల్యూఏ 38 క్రిస్ప్ అసలు పేరు డబ్ల్యూఏ 38. పండుపై నుండే ఎరుపు రంగుపై చిన్న చిన్న తెలుపు స్పాట్స్‌ను చూస్తే రాత్రి టైంలో ఆకాశాన్ని చూసినట్టుందని ‘కాస్మిక్’ అని పేరు పెట్టారు. ఇప్పుడిదే ట్రేడ్ మార్క్ అయిపోయింది. క్రిస్ప్ ప్లాంటింగ్‌ను కమర్షియల్‌గా 2017లో మొదలుపెట్టారు. సాగుకు ఎక్కువ మంది రైతులు ముందుకు రావడంతో లాటరీ తీసి మరి విత్తనాలిచ్చారు. ప్రస్తుతం వాషింగ్టన్ స్టేట్ వ్యాప్తంగా 1.2 కోట్ల చెట్లున్నాయి. 12 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. వీటన్నింటి విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుందంటున్నారు. 2027 వరకు ప్రపంచ మార్కెట్‌లో అమ్ముకునేలా రైతులకు హక్కులిచ్చారు. 2020 నాటికి 20 లక్షల పండ్ల సేల్? 453 గ్రాముల కాస్మిక్ క్రిస్ప్ పండ్లను రూ.350కు అమ్ముతున్నారు. ప్రతి 18 కిలోల పండ్ల అమ్మకానికి 4.75 రాయల్టీ వాషింగ్టన్ స్టేట్ వర్సిటీ, తన కమర్షియల్ పార్ట్‌నర్‌కు వెళ్తుంది. ఈ ఏడాది చివరి కల్లా ఈ 18 కిలోల పండ్ల బాక్సులను సుమారు 4.67 లక్షలు షిప్పింగ్ చేస్తారని అంచనా. 2020 నాటికి ఇది 20 లక్షలకు చేరుతుందని, 2021 నాటికి 56 లక్షలకు చేరుకుంటుందని లెక్కేస్తున్నారు. ‘ఇప్పటికే చాలా వెరైటీలున్నాయి కదా? వాటిని తట్టుకుంటుందా’ అని రైతులను అడిగితే.. యాపిల్ మార్కెట్‌ను క్రిస్ప్ షేక్ చేస్తుందని ధీమాగా చెబుతున్నారు. గత 30 ఏళ్లుగా యూఎస్‌లో యాపిల్ అమ్మకాల్లో ఏం తేడా లేదని, వస్తున్న లాభం కూడా తక్కువేనన్నారు. ఈ కొత్త క్రిస్ప్ యాపిల్ అమ్మకాలు కచ్చితంగా పెంచుతుందని నమ్మకంగా చెబుతున్నారు.
సరికొత్త యాపిల్ రకం…కాస్మిక్ క్రిస్ప్
Related tags :