DailyDose

రజనీకాంత్‌కు భాజపా ఆహ్వానం-రాజకీయ-10/23

BJP Invites Rajinikanth-Telugu Political News Today-10/23

* తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బీజేపీలో చేరాలని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొన్‌.రాధాకృష్ణన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన పుదుకోటలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, నాంగునేరి పోలింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ వసంత్‌కుమార్‌ ఆ నియోజకవర్గంలో ప్రవేశించడం ఎన్నికల నిబంధనల చట్టం మేరకు నేరమేనని చెప్పారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోతారనే భయంతో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించడం కోసమే వసంత్‌కుమార్‌ నాంగునేరికి వెళ్ళారని ఆరోపించారు. అంతేకాకుండా వసంత్‌ కుమార్‌ నాంగునేరి కాంగ్రెస్‌ అభ్యర్థి రూబీ మనోహరన్‌ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని పేర్కొన్నారు. డీఎంకే సదావర్తి భూములను ఆక్రమించుకుని ఆ స్థలంలో పార్టీ పత్రిక కార్యాలయం నడుపు తోందని పీఎంకే నేత రాందాస్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీని ప్రారంభిస్తే తాను మనసారా స్వాగతిస్తానని, అయితే పార్టీని ప్రారంభించడం కంటే ఆయన బీజేపీలో చేరితే చాలా మంచిదని తాను భావిస్తున్నానని రాధాకృష్ణన్‌ తెలిపారు. డాక్టర్‌ ఎంజీఆర్‌ విశ్వవిద్యాలయం నుండి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి డాక్టర్‌ పట్టాను స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. నాంగునేరి, విక్రవాండి నియోజకవర్గంలో బీజేపీ కూటమి మిత్రపక్షమైన అన్నాడీఎంకే అభ్యర్థులే గెలుస్తారని రాధాకృష్ణన్‌ జోస్యం చెప్పారు.
*భాజపా గాంధీ బట
గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో జరిగే గాంధీ సంకల్ప యాత్ర పేరుతో బిజెపి నేతలు చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ఉదయం కడప జిల్లా చక్రాయపేట మండల కేంద్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి గండి ఆంజన్నను వేడుకొన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం.. పులివెందులలో జరిగే గాంధీ సంకల్ప యాత్ర లో ఆయన పాల్గొనే ముందు గండి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన గండి క్షేత్రానికి విచ్చేయడంతో గండి ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజా స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదం అందచేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాలువతో సత్కరించి స్వామి వారి చిత్ర పటం అందజేశారు. ఆయన తో పాటు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దేశం వెంకటసుబ్బారెడ్డి, బిజెవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరి, సుస్మ, కార్యకర్తలు స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన పులివెందులకు లో జరిగే సంకల్ప యాత్రలో పాల్గొన్నేందుకు బయలుదేరి వెళ్లారు
* తెదేపాది గంటకో మాట: బుగ్గన
ఇసుక విషయంలో ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరిస్తోందని.. కొద్దిరోజుల్లో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. నదులకు వరదలు వచ్చిన కారణంగానే ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక విషయాల్లో తెదేపా గంటకోసారి మాట మారుస్తోందని ఆరోపించారు. రైతు భరోసాను ఏడాది ముందే అమలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు.
* సొంత నాయకులనే గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు
పార్టీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలను సొంత పార్టీ కార్యకర్తలే గాడిదలపై ఊరేగించిన ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. గత మంగళవారం బనీపార్క్‌లోని బీఎస్పీ కార్యాలయం ముందు పార్టీ నేషనల్‌ కోఆర్టీనేటర్‌ రామ్‌జీ గుప్తా, మాజీ ఇంచార్జ్‌ సీతారాంలను కార్యకర్తలు చుట్టుముట్టారు. వారి ముఖాలకు నల్లరంగు పులిమి, మెడలో చెప్పుల దండ వేశారు.అనంతరం గాడిదలపై ఊరేగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తోన్న కార్యకర్తలను కాదని వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయించారని ఆరోపించారు. డబ్బులకు టికెట్లు అమ్ముకొని కార్యకర్తలను మోసం చేశారని మండిపడ్డారు. తమ గోడును అధినేత్రి మాయావతికి తెలియనీయకుండా చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు అడిగినా మాయావతికి దగ్గరకు పంపించలేదని, అందుకే తాము ఈ చర్యలకు పాల్పడ్డామని చెప్పారు. కాగా ఈఘటనపై మాయావతి స్పందించారు. పార్టీ నేతలు ఇలా చేడయం సిగ్గుచేటని, ఈ ఘటనపై విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
* జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారు: నక్కా ఆనందబాబు
టీడీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ యాత్ర బుధవారం విజయవాడలో నిర్వహించారు. యాత్రను పోలీసులు అడ్డుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తప్పులను ప్రశ్నించిన ప్రతిపక్షాలు, మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారని, వర్ల రామయ్యపై పోలీసు అధికారుల సంఘం నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయ నేతల్లా వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆనందబాబు డిమాండ్ చేశారు.
* దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలి: అశ్వత్థామరెడ్డి
ఉప ఎన్నికలు వేరు..జనరల్ ఎన్నికలు వేరని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ ప్రకటనలు కార్మికులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్లుగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే.. ప్రభుత్వం, అధికారులు దున్నపోతు మీద వాన పడినట్టుగా వ్యవహరిస్తున్నారని అశ్వత్థామరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
*బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు
జార్ఖండ్ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీకి కొంతమంది నాయకులు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం రఘుబార్ దాస్ సమక్షంలో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. బీజేపీలో చేరిన వారిలో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కునాల్ సారంగి, జేపీ భాయి పటేల్, చమ్రా లిండా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సుఖ్‌దేవ్ భగత్, మనోజ్ యాదవ్, నవ జవాన్ సంఘర్ష మోర్చాకు చెందిన ఎమ్మెల్యే భాను ప్రతాప్ సాహీ ఉన్నారు. జార్ఖండ్‌లో ప్రస్తుత శాసనసభ కాలం ఈ ఏడాది డిసెంబర్ 27వ తేదీతో ముగియనుంది. దీంతో జార్ఖండ్ శాసనసభకు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
*దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే విజయసాయిరెడ్డి: బుద్దా వెంకన్న
ఏపీ సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దరిద్రానికి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఆ దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే విజయసాయిరెడ్డిలా ఉంటుందన్నారు. జగన్‌ను తుగ్లక్‌తో పోలుస్తూ.. ఆయన అడుగు పెట్టాకా రాష్ట్రానికి అన్నీ అపశకునాలేనని వ్యాఖ్యానించారు. బోట్ ముంచి 56 మంది అమాయకులని.. 256 మంది రైతుల్ని మింగేసారన్నారు. విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారం చేశారని ఆరోపించారు. 30 లక్షలమంది భవననిర్మాణ కార్మికులని రోడ్లపై నిలబెట్టారన్నారు. డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారన్న ఆయన.. అన్నక్యాంటీన్ మూసేసి పేద వాడి పొట్ట కొట్టారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ డీఎన్ఏలో ఉన్న దరిద్రానికి ఫుల్ స్టాప్ పడదు సాయి రెడ్డి అంటూ ట్వీట్ చేశారు.
*తీహార్‌ జైల్లో డీకేను కలుసుకున్న సోనియా
తీహార్ జైల్లో ఉన్న కర్నాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కలుసుకున్నారు. గత నెల 3న అరెస్ట్ అయిన డీకేను పార్టీ దూరం పెట్టిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న డీకే శివకుమార్‌ను మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ తదితర దర్యాప్తు సంస్ధలు విచారిస్తున్నాయి. డీకేతో కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమార స్వామి భేటీ అయిన రెండు రోజులకే సోనియా గాంధీ సమావేశం కావడం గమనార్హం.
*హీరో రజనీ కాంత్‌కు బీజేపీ ఆహ్వానం
తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బీజేపీలో చేరాలని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పొన్‌.రాధాకృష్ణన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన పుదుకోటలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, నాంగునేరి పోలింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ వసంత్‌కుమార్‌ ఆ నియోజకవర్గంలో ప్రవేశించడం ఎన్నికల నిబంధనల చట్టం మేరకు నేరమేనని చెప్పారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోతారనే భయంతో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించడం కోసమే వసంత్‌కుమార్‌ నాంగునేరికి వెళ్ళారని ఆరోపించారు.
*దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే విజయసాయిరెడ్డి: బుద్దా వెంకన్న
ఏపీ సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దరిద్రానికి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఆ దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే విజయసాయిరెడ్డిలా ఉంటుందన్నారు. జగన్‌ను తుగ్లక్‌తో పోలుస్తూ.. ఆయన అడుగు పెట్టాకా రాష్ట్రానికి అన్నీ అపశకునాలేనని వ్యాఖ్యానించారు. బోట్ ముంచి 56 మంది అమాయకులని.. 256 మంది రైతుల్ని మింగేసారన్నారు. విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారం చేశారని ఆరోపించారు. 30 లక్షలమంది భవననిర్మాణ కార్మికులని రోడ్లపై నిలబెట్టారన్నారు. డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారన్న ఆయన.. అన్నక్యాంటీన్ మూసేసి పేద వాడి పొట్ట కొట్టారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ డీఎన్ఏలో ఉన్న దరిద్రానికి ఫుల్ స్టాప్ పడదు సాయి రెడ్డి అంటూ ట్వీట్ చేశారు.
*ఆర్టీసీ సమ్మె అణచివేత తగదు: ఏచూరి
ఆర్టీసీ కార్మికుల సమ్మె అణచివేత తగదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని.. ఏవైనా అభ్యంతరాలుంటే సంఘాలతో చర్చించి పరిష్కరించుకోవాలని ఏచూరి సూచించారు.
*బ్యాంకుల నిర్వీర్యానికి కేంద్రం కుట్ర: చాడ
బ్యాంకుల విలీన యోచనను విరమించుకోవాలని, వేతన సవరణ అమలు చేయాలనే డిమాండ్లతో మంగళవారం ఒక రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హైదరాబాద్ కోఠిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద బ్యాంకు అధికారులు, ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. విలీనం పేరిట ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఏఐబీఈఏ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పాల్గొన్నారు.
*మళ్లీ చంద్రబాబు గెలిస్తే బాగుండేది
రాజధాని అంతా ఒక చోట ఏర్పాటైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయని గుంటూరు లోక్సభ సభ్యుడు, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులతో కలిసినప్పుడు ఆంధ్ర ప్రజలు పొరపాటు చేశారని, మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే ఎంతో బాగుండేదని అభిప్రాయపడుతున్నారని చెప్పారు. ‘ఐదేళ్లలో రాష్ట్రానికి 600 అవార్డులు కేంద్రం నుంచి మనకు వచ్చాయి. అన్ని ప్రభుత్వ శాఖలకు మన గొప్పదనం తెలుసు’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధికి నిధులు వెచ్చించాం.
*రాయలసీమ’ మనోభావాలను దెబ్బతీస్తున్నారు: శ్రీకాంత్రెడ్డి
‘ అసహనంతోనే ముఖ్యమంత్రి జగన్పై చంద్రబాబు అభ్యంతరకర భాష వాడుతూ విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన వైకాపా కార్యాలయంలో మాట్లాడారు. ‘రాయలసీమ గూండాలు, రౌడీలంటూ ఆ ప్రాంత ప్రజల మనోభావాలను కించపరుస్తున్నారు. అక్కడున్నవాళ్లు మనుషులు కారా? ఇలాగే మాట్లాడుతుంటే ఆ ప్రాంతమహిళలు మీకు వాతలు పెడతారు’ అని అన్నారు.