*మనీ లాండరింగ్ కేసులో కర్నాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెయిల్ లభించింది. డిల్లి హైకోర్టు బుధవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాతిక లక్షల పూచికట్టు సమర్పించాలని దేశం విడిచి వెళ్లరాదని ఉన్నత న్యాయస్థానం షరతులు విధించింది.
* జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ .. భారత్‌కు రానున్నారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఆమె భారత్‌లో పర్యటిస్తారు. పలు ద్వైపాక్షిక అంశాలపై ఆమె చర్చించనున్నారు. రెండేళ్ల క్రితం బెర్లిన్ వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడ ఛాన్సలర్ మెర్కల్ ను కలిసిన విషయం తెలిసిందే. స్మార్ట్ సిటీలు, నైపుణ్యాభివృద్ధి, శుద్ధ ఇంధనం లాంటి అంశాల గురించి చర్చించారు.
* మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 లక్షల పూచీకత్తుపై బెయిల్‌కు అంగీకరించింది. బెయిల్ మంజూరు చేసినందువల్ల ఆయన సాక్ష్యాలకు సంబంధించిన పత్రాలను తారుమారు చేయలేరని, అవి ఈడీ అధికారుల వద్దే ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ వెల్లడించారు.
* ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలనపై మాజీ ఎంపీ, తెదేపా సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన పాలన జనరంజకంగా సాగుతోందని.. తాను జగన్‌కు 100కు 150 మార్కులు వేస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు తన స్సులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటివరకు తమ ట్రావెల్స్‌కు చెందిన 31బస్సులను సీజ్ చేశారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు.
* కార్మిక సంఘాల ఐక్యత దెబ్బతినదు …ఎవరూ అధైర్యపడొద్దని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌పై తాము వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
* పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా కొల్లూరులో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
* ఆసిఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డిపై బదిలీ వేటు పడింది. నర్సింహారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు సందర్శించారు. బాదామి సమీపంలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన సందర్శించారు. అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
* దుర్గి మండలం, ఫ్యాక్షన్ గ్రామలైన ఆత్మకూరు, జంగమహేశ్వరపాడు గ్రామాలలో గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్, జిల్లా రూరల్ ఎస్పీ విజయరావు లు బుధవారం పర్యటించారు.
* సత్తెనపల్లిలోని అగ్నిమాపక, శిక్షణా కేంద్రాలను అధికారులు బుధవారం పరిశీలించారు. డిఐజి, ఎఆర్ అనురాధ, ఎడి వెంకటరమణ , జిల్లా ఫైర్ అధికారులు మాల్యాద్రీ, ధర్మారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గన్నారు
* గుంటూరు జిల్లా పేరేచెర్ల లో కౌలు రైతుల రాష్ట్ర రెండవ మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ వేణుగోపాల్ అధ్యక్ష ప్రసంగంతో సభలు ప్రారంభమయ్యాయి.
*నారాయణపుర్ ప్రాజెక్టు భారీ వరద 22 గేట్స్ ఎత్తివేతఇన్ ఫ్లో : 2.80.000క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3.01.052 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం : 492.252 మీటర్లుప్రస్తుత నీటిమట్టం : 491.14 మీటర్లు
*జూరాల ప్రాజెక్టు వరద 28 గేట్స్ ఎత్తివేతఇన్ ఫ్లో : 2.86.000క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 2.97.800 క్యూసెక్కులు
ప్రస్తుతం నీటి నిల్వ : 8.969 టంఛ్పూర్తిస్థాయి నీటి నిల్వ : 9.657 టంఛ్ ప్రస్తుత నీటి మట్టం : 318.180ం
పూర్తిస్థాయి నీటి మట్టం: 318.516ంఎగువ…, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలోని 12 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి.
*శ్రీశైలం జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటివిడుదల. ఇన్ ఫ్లో : 4,లక్ష ల 48, 648 క్యూసెక్కులు అవట్ ప్లో : 2,లక్ష 64 వేల 610 క్యూసెక్కులుజలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం : 215. టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ : 214.3637. టిఎంసిలు.జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885. అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం :884.80 అడుగులు
*ఆత్మాహుతి దాడితో భారత ప్రధాని నరేంద్ర మోదీని అంతం చేస్తానంటూ పాకిస్తాన్ సింగర్ రబీ పిర్జాదా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
*అల్పపీడనం వాయుగుండంగా మారుతోంది. రాత్రికి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులో తీరం దాటే అవకాశం ఉంది. 24 గంటల్లో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
*గుంటూరు జిల్లా పేరేచెర్ల లో కౌలు రైతుల రాష్ట్ర రెండవ మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ వేణుగోపాల్ అధ్యక్ష ప్రసంగంతో సభలు ప్రారంభమయ్యాయి.
*సత్తెనపల్లిలోని అగ్నిమాపక, శిక్షణా కేంద్రాలను అధికారులు బుధవారం పరిశీలించారు. డిఐజి, ఎఆర్ అనురాధ, ఎడి వెంకటరమణ , జిల్లా ఫైర్ అధికారులు మాల్యాద్రీ, ధర్మారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గన్నారు
*హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో మరికాసేపట్లో ఈడీల కమిటీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఈడీల కమిటీ చర్చించనుంది.
*తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీతతో బయటపడ్డ మృతదేహాలను గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు.
*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు సందర్శించారు. బాదామి సమీపంలో వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన సందర్శించారు. అక్కడి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
*ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు ఏబీవీపీ ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
*పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆర్థిక మాంద్యంపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు యత్నిస్తున్నారు. నవంబర్ 18వ తేదీనుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
*బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో కలకలం రేగింది. రాయలసీమ డిక్లరేషన్‌పై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తేవడం లేదని విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
*అరకులోయమండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలకు ప్రవేశాల టికెట్ ధరల్లో పర్యాటక శాఖ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం అమలవుతున్న ధరల కాస్త మార్చుతూ బుధవారం నుంచి నూతన ధరలను అందుబాటులోకి తేనుంది. ప్రసుత్తం పెద్దలకు రూ.60, చిన్న పిల్లలకు రూ.45, వీడియో కెమెరాకు రూ.100, సెల్‌ఫోన్‌కు రూ.25 టిక్కెట్ ధర ఉండేది. వీటిని మారుస్తూ పెద్దలకు రూ.70, పిల్లలకు రూ. 50 చేశారు. వీడియె కెమెరాకు గతంలో ఉన్న రూ.100 నే ఉంచగా, సెల్‌ఫోన్‌కు టికెట్ ధర రద్దుచేస్తూ పర్యాటకశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన ధరలు 23 నుంచి అమలవుతున్నట్లు అధికారులు తెలిపారు.
* ఇసుక కొరత తీర్చాలంటూ.. సిఐటియు ఆధ్వర్యంలో కొత్తవలసలో భవన నిర్మాణ కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఇసుకను అందుబాటులోకి తేవాలని, ఇసుక టన్ను రూ.150 లకే ఇవ్వాలని, ఇసుక రీషు స్టాక్ పాయింట్లు పెంచాలని, పనులు లేని కాలానికి వెల్ఫేర్ బోర్డు ద్వారా రూ.10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
*దేశంలో జరుగుతున్న నేరాలపై …జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన 2017 నివేదిక వణుకు పుట్టిస్తోంది.
*జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం త్రాల్‌లో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అన్సార్ ఘజ్వాత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. అన్సార్ ఘజ్వాత్ ఉగ్ర సంస్థకు ఆల్ ఖైదాతో సంబంధాలున్నాయి. హతమైన వారిలో ఆ సంస్థ కమాండర్ జాకీర్ మూసా వారసుడు అబ్దుల్ హమీద్ లేల్హారీ కూడా ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. అంతే కాకుండా వారి స్థావరాల్లో ఆయుధాలు, మందు గుండు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
*నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 48 గంటల్లో ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంగా పయనిస్తోంది.
*నెలలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలన్న సీఎం జగన్ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 16న కేబినెట్ సమావేశం జరిగింది. మళ్లీ ఈ నెల 30న ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కాగా, ఈ నెల 17న జరిగిన సమావేశంలో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేబినెట్ అజెండా అంశాలను ఈ నెల 26లోగా తన ఆమోదం పొందాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు నోట్ పంపారు.
*చాణక్య ఫౌండేషన్ సంస్థ ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నియోజకవర్గ పురస్కారం అందుకున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభినందించారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన దిల్లీలోని చాణక్య ఫౌండేషన్ తెలంగాణలోని పరకాలను ఉత్తమ నియోజకవర్గంగా ఎంపిక చేసింది.
*యువత వ్యవసాయరంగం వైపు ఆకర్షితులు కావాలంటే ఆ రంగాన్ని లాభసాటిగా మార్చాలని రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ అభిప్రాయపడ్డారు. అందుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయరంగ నిపుణులు కృషి చేయాలని కోరారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘యూత్ యాజ్ టార్చ్ బేరర్స్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ అగ్రికల్చర్ ఇన్ సౌత్ ఇండియా’ కార్యశాల మంగళవారం ముగిసింది.
*గిరిజన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరేవిధంగా పనిచేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు. శిక్షణ కార్యక్రమాలతో నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లో మంగళవారం గిరిజన శాఖ అధికారులు, సిబ్బందికి సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
*రాష్ట్రంలోని 391 ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.35.19 కోట్లు మంజూరు చేసింది.వీటి గదుల నిర్మాణానికి గత మేలో సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆమోదిత మండలి ఆమోదం తెలిపింది.
*అద్దె ప్రాతిపదికన 1035 బస్సులు నడపడానికి ఆర్టీసీ జారీ చేసిన టెండరు నోటిఫికేషన్ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టెండర్లను నిలిపివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికసంఘ్ తరఫున ప్రధాన కార్యదర్శి పి.రమేష్కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు
*నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు సంబంధించిన 12 గేట్లను అధికారులు ఎత్తివేశారు. నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.24లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి సంబంధించిన 7 గేట్లను అధికారులు ఎత్తివేశారు. శ్రీశైలం ఇన్‌ఫ్లో 4.48లక్షలు కాగా.. ఔట్‌ఫ్లో 2.64లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన 15 గేట్లను ఎత్తివేశారు. ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 82వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.8420 టీఎంసీలకు నీరు చేరుకుంది.
*కేరళ బిజెపి ఉపాధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కుట్టీ నియమితులయ్యారు. సిపిఎం సభ్యుడైన అబ్దుల్ కుట్టీ ఆ పార్టీనుంచి రెండుసార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ప్రశంసించిన సందర్భంగా కుట్టీని సిపిఎం 2009లో పార్టీనుంచి బహిష్కరించింది.
*ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ విలీనం అవసరం లేదని చెప్పినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా రెడీ అన్నారు.
*దుర్గి మండలం, ఫ్యాక్షన్ గ్రామలైన ఆత్మకూరు, జంగమహేశ్వరపాడు గ్రామాలలో గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్, జిల్లా రూరల్ ఎస్పీ విజయరావు లు బుధవారం పర్యటించారు.
* కార్మిక సంఘాల ఐక్యత దెబ్బతినదు …ఎవరూ అధైర్యపడొద్దని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌పై తాము వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్క డిమాండ్‌నూ వెనక్కు తీసుకోబోమని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటం అన్యాయమని తేలితే రేపే విధులకు హాజరవుతామని ప్రకటించారు.
* ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో సౌదీఅరేబియాలో పర్యటించనున్నారు. వార్షిక పెట్టుబడుల సదస్సు నిమిత్తం అక్టోబరు 29న మోదీ సౌదీ వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. సౌదీ అరేబియాలో అక్టోబరు 29 నుంచి 31 వరకు ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనీషియేటివ్(ఎఫ్ఐఐ) వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు. ఒక రోజు పాటు ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతల మధ్యచర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
* తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పాలక మండలి తీర్మానం చేసిందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్విమ్స్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో తితిదే ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. తితిదే పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ బోర్డు తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్పులు, చేర్పులతో గరుడ వారధిని పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. తిరుపతిలో మద్యపాన నిషేధంపై చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.
* బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఈ దీపావళికి బోనస్‌ను చెల్లించనున్నట్టు ప్రకటించింది. సింగరేణిలో దీపావళికి ముందు కార్మికులకు బోనస్ చెల్లిస్తుంటారు. గతేడాది కార్మికులకు రూ.60,500 చొప్పున చెల్లించగా.. ఈసారి 64,700 చొప్పున బోనస్‌గా ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రతిభ ఆధారిత ప్రయోజనం (పీఎల్ఆర్- బోనస్)కింద ఈ బోనస్ మొత్తాన్ని ఈ నెల 25న కార్మికులకు చెల్లించనున్నట్టు యాజమాన్యం స్పష్టంచేసింది.
* ఇసుక విషయంలో ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరిస్తోందని.. కొద్దిరోజుల్లో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నదులకు వరదలు వచ్చిన కారణంగానే ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక విషయాల్లో తెదేపా గంటకోసారి మాట మారుస్తోందని ఆరోపించారు. రైతు భరోసాను ఏడాది ముందే అమలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారన్నారు.
* బిల్లు వెనక్కివివాదాస్పద నేరస్థుల అప్పగింత బిల్లుపై హాంకాంగ్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఆ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బిల్లును అధికారికంగా ఉపసంహరించుకున్నట్లు సెక్రటరీ ఫర్ సెక్యూరిటీ జాన్ లీ వెల్లడించారు.
* కాంగ్రెస్ పార్టీ ప్రగతిభవన్ ముట్టడి సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆసిఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆయన్ను ఆదేశించిది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నర్సింహారెడ్డిని బదిలీ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు.
* ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలనపై మాజీ ఎంపీ, తెదేపా సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన పాలన జనరంజకంగా సాగుతోందని.. తాను జగన్‌కు 100కు 150 మార్కులు వేస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు తన స్సులే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటివరకు తమ ట్రావెల్స్‌కు చెందిన 31బస్సును సీజ్ చేశారన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు.
* మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 లక్షల పూచీకత్తుపై బెయిల్‌కు అంగీకరించింది. బెయిల్ మంజూరు చేసినందువల్ల ఆయన సాక్ష్యాలకు సంబంధించిన పత్రాలను తారుమారు చేయలేరని, అవి ఈడీ అధికారుల వద్దే ఉన్నాయని న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ వెల్లడించారు.
* దేశీయ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో నేటి ట్రేడింగ్‌లో చాలా సేపు ఊగిసలాడిన సూచీలు.. ఆ తర్వాత ఐటీ, బ్యాంకింగ్, ఆటో షేర్లు రాణించడంతో కాస్త కుదుటపడ్డాయి. కొనుగోళ్ల అండతో స్వల్ప లాభాలను నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ మళ్లీ 39వేల మార్క్ దాటింది.
* ’తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో వెలికితీసిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో గల్లంతైన వారి బంధువులు గుర్తిస్తున్నారు. రాయల్ వశిష్ఠ బోటు డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం గుర్తించారు. అలాగే, వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండవాసి కొమ్ముల రవీంద్ర మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఆయన జేబులో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా ఆ మృతదేహం ఆయనదేనని నిర్థారించారు.
* తితిదే ధర్మకర్తల మండలి భేటీ అయింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు, దర్శన సంబంధిత సేవలపై కీలకంగా చర్చించనున్నారు. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ సమావేశం కొనసాగుతోంది. తిరుపతిలో గరుడ వారధి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, పీఆర్వో విభాగంలో పదోన్నతులు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పెట్టుబడులు తదితర అంశాలపై నిర్ణయాలుతీసుకోనున్నారు.
* వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం ప్రారంభ వీఐపీ సేవలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దర్శించుకున్నారు. ఆమెకు తితిదే ఉన్నతాధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. తొలుత వరాహస్వామిని దర్శించుకున్న గవర్నర్ ఆతర్వాత స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు.
* ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు.. తాజాగా బుధవారం ఉదయం మరో ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా మొత్తం పది గేట్లను పది అడుగుల మేరపైకి ఎత్తారు. శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 4.60 లక్షల క్యూసెక్కులు కాగా.. స్పిల్‌వే ద్వారా 2.79 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రవాహం స్థిరంగా ఉండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
* తెలంగాణ హోంశాఖలోని రెండు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. హోంశాఖ కార్యదర్శిగా రవిగుప్తాను, జైళ్ల శాఖ డీజీగా రాజీవ్ త్రివేదిని నియమించారు. రవిగుప్తా ప్రస్తుతం తెలంగాణ అదనపు పోలీస్ డైరెక్టర్‌జనరల్(టెక్నాలజీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పురపాలక ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై దాదాపు స్పష్టత రావడంతో చేపట్టిన ఈ మార్పులు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.
* భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో దాదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయని సంగతి తెలిసిందే. 33 నెలల పాటు బీసీసీఐని నడపించిన సుప్రీంకోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 39వ అధ్యక్షుడిగా దాదా నియమితులయ్యారు.
* లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్)ను ప్రధాని మోదీ తన పారిశ్రామిక రంగ స్నేహితులకు కట్టబెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ యూనియన్ సభ్యులను కలిసిన రాహుల్.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు సమర్పించిన పిటిషన్‌ను రాహుల్ ట్విటర్‌లో పోస్టు చేశారు.
* ధర్మేంద్రను పెళ్లి చేసుకున్నాను కానీ, మొదటి భార్య, కుటుంబం నుంచి నేను ఆయన్ని వేరు చేయలేదు అని అంటున్నారు నటి, ఎంపీ హేమమాలిని. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. ‘ధర్మేంద్రను చూసిన మొదటి క్షణంలోనే.. ఆయన సొంతమనిషి వలే అనిపించారు. ఈ జీవితాన్ని ఆయనతో గడపాలనుకున్నాను. ఆయన్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరూ బాధపడకూడదు అని నిర్ణయిచుకున్నాను’ అని చెప్పారు.
చిదంబరం ఎదురుచూపులు-తాజావార్తలు-10/23
Related tags :