శ్రీ వికారి నామ సంవత్సరంలో వచ్చే దీపావళి పండుగకు సంబంధించిన వివరములు ఈ క్రింది విధంగా తెలుస్తున్నాయి. అక్టోబర్ 27వ తేదీ ఆదివారం రోజున చతుర్దశి తిథి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు ఉండి తదుపరి అమావాస్య తిథి ప్రారంభం అవుతున్న కారణంచేత ఆ రోజుననే నరకచతుర్దశి (అనగా తెల్లవారుజామున మంగళహారతులు ఇచ్చుకోవాలి) మరియు రాత్రి సమయంలో అమావాస్య తిథి ఉన్న కారణం చేత ఆ రోజున నే దీపావళి పండుగను మరియు ధనలక్ష్మి పూజలను ఆచరించాలి. 28వ తేదీ సోమవారం రోజున అమావాస్య తిథి ఉదయం 9 గంటల 31 నిమిషాల వరకు మరియు స్వాతి నక్షత్రం రాత్రి2:54 వరకు ఉన్న కారణం చేత నూతనంగా కేదార వ్రతం ప్రారంభం చేసుకునేవారు సోమవారం నాడు కేదార వ్రతం చేసుకొని గురువారం నాడు నోము ఎత్తుకోవాలి.పుట్టు బుధవారం ఆచారం ఉన్నందున గురువారం నాడు దేవుని ఎత్తుకోవాలి. అయితే గురువారం రోజున దేవుని ఎత్తుకునే వారు ఉదయం 6.50 లోపున లేదా ఉదయం 8.26 నిముషాల తర్వాత దేవుని ఎత్తుకోవాలి. ఈ సంవత్సరము స్వాతి నక్షత్రము మరియు అమావాస్య తిథి సూర్యోదయంలో కలిసి ఉన్న కారణం చేత కొత్త నోములు ఆచరించుకోవచ్చు.
**పాత నోములు గల వారు
సోమవారం నాడు రాత్రి నోముకొని గురువారం నాడు దేవుని ఎత్తు కొనవ లెను.కొందరి మతమున మంగళవారం మరియు పుట్టు బుధవారం దేవుని ఎత్తుకోడానికి అంగీకరించరు. కావున గురువారం నాడే దేవుని ఎత్తుకొన వలెను.
అమావాస్య రాత్రి తో సంబంధం లేని వారు కూడా బుధవారం నా డే కేదార నోము నోముకొని గురువారం నాడు దేవుని ఎత్తుకోవాలి. కావున ఈ విషయాన్ని ప్రజలు గమనించాల్సింది గా తెలియజేస్తున్నాను.
2.కాటేజీ దాతల సిఫార్సు లేఖలు స్వీకరించం
ఆంగ్ల నూతన సంవత్సరాది 2020 జనవరి 1న, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలైన జనవరి 6, 7 తేదీల్లో భక్తుల రద్దీ కారణంగా తిరుమలలో గదుల కేటాయింపుపై ఆంక్షలు విధించినట్లు తితిదే మంగళవారం తెలిపింది. కాటేజీ దాతలు, విరాళాల దాతల సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. డిసెంబరు 30 నుంచి జనవరి 1 వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుంచి 7 వరకు గదుల కేటాయింపు ఉండదని పేర్కొంది.
3. తితిదే బోర్డు ధర్మకర్తల మండలి భేటీ
తితిదే ధర్మకర్తల మండలి భేటీ అయింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, వసతులు, దర్శన సంబంధిత సేవలపై కీలకంగా చర్చించనున్నారు. తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈ సమావేశం కొనసాగుతోంది. తిరుపతిలో గరుడ వారధి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, పీఆర్వో విభాగంలో పదోన్నతులు, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పెట్టుబడులు తదితర అంశాలపై నిర్ణయాలుతీసుకోనున్నారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. అనంతరం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బోర్డు నిర్ణయాలను మీడియాకు వెల్లడించనున్నారు.
4.చీకట్లను చీల్చే కాంతిరేఖ దేవాలయం
దేవాలయమంటే కష్టాలు వచ్చినప్పుడో, సమయం దొరికినప్పుడో వెళ్లి సేదతీరే ఆశ్రమం కాదని.. చీకట్లను చీల్చి వెలుగులు నింపే కాంతిరేఖ అని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ‘ఇందూరు తిరుమల’ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన పద్మావతి కల్యాణ మండపాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ఆలయాలు భగవంతుణ్ని భక్తులకు చేరువ చేస్తాయని, ఇవి ఒకరి ఆధిపత్యంలోనో, పాలకుల పర్యవేక్షణలోనో ఉండకూడదని అభిప్రాయపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి సమాన ప్రాధాన్యమిస్తామన్నారు. ఇందూరు తిరుమల ఆలయంలో చిన్నారులకు అందజేసే అమృత ప్రాసన ఔషధాన్ని తిరుమలలోనూ పంపిణీ చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.
5. తిరుమల \|/ సమాచారం *ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు బుదవారం
23.10.2019
ఉదయం 7 గంటల
సమయానికి,
తిరుమల: 20C°-26℃°
• నిన్న 61,958 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 01
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 2.87 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
గమనిక:
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
#ఈనెల 30 న చంటిపిల్లల
తల్లిదండ్రులకు శ్రీవారి
ప్రత్యేక ప్రవేశ దర్శనం
(ఉ: 9 నుండి మ:1.30
వరకు సుపథం మార్గం
ద్వారా దర్శనానికి
అనుమతిస్తారు,
#ఈనెల 29న వృద్ధులు,
దివ్యాంగులకు ప్రత్యేక
ఉచిత దర్శనం,
(భక్తులు రద్దీ సమయాల్లో
ఇబ్బంది పడకుండా ఈ
అవకాశం సద్వినియోగం
చేసుకోగలరు)
వయోవృద్దులు / దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండి
https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
6. తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
ఈరోజు బుధవారం 23-10-2019 ఉదయం 5 గంటల సమయానికి.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…
శ్రీవారి దర్శనానికి 1 కంపార్ట్ మెంటులో వేచి ఉన్న భక్తులు…….
శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (₹-300) దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది….
కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది…..
నిన్న అక్టోబర్ 22 న 61,958 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.87 కోట్లు…
7. మన ఇతిహాసాలు బబ్రువాహనుడు
పంచమవేదమైన మహాభారతంలో అనేక ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. హస్తినపుర సింహాసం కోసం కురుపాండవుల మధ్య తలెత్తిన వివాదం చివరకు కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారితీసింది. ధర్మం పాండవుల పక్షాన నిలవడంతో వారు విజయం సాధించారు. ఇందులో కీలకపాత్ర జగన్నాటక సూత్రధారి కృష్ణుడిదే. అయితే విలువిద్యలో అర్జునుడిని మించిన వీరుడు కూడా లేడు. అలాంటి అర్జునుడి తన కొడుకు చేతిలో ఓడిపోయి, మరణానికి చేరువయ్యాడు. ఈ ఘటన మౌసల పర్యం లేదా అశ్వమేధ పర్యంలో చోటు చేసుకుంది. స్వయంవరంలో గెలుపొందిన ద్రౌపది, కృష్ణుడి సోదరి సుభద్ర, నాగకన్య ఉలూపి, చిత్రాంగద ఈ నలుగురూ అర్జునుడి భార్యలు.
గతంలో అర్జునుడు మణిపురి యువరాణి చింత్రాగదను ప్రేమిస్తాడు. తన పెద్ద కొడుకుని మణిపురి రాజ్యానికి రాజుగా చేస్తానని మాటిస్తే తనను వివాహం చేసుకుంటానని చిత్రాంగద కోరుతుంది. ఈ షరతుకు ఒప్పుకుని ఆమెను అర్జునుడు వరించాడు. కొన్నేళ్లకు బబ్రువాహనుడు జన్మించాడు. ఆ తర్వాత అర్జునుడు మణిపురి నుంచి హస్తినకు చేరుకున్నాడు.కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు అశ్వమేధయాగం తలపెట్టాడు. యాగంలో భాగంగా అశ్వాన్ని విడిచిపెట్టినప్పుడు వివిధ రాజ్యాలలో సంచరిస్తుంది. ఇలా ప్రయాణించినప్పుడు దాన్ని ఎవరైనా అడ్డుకుంటే వారిని యుద్ధంలో ఓడించాలి. అప్పుడే ఆ రాజ్యం వీరి సొంతమవుతుంది. దశాబ్దం తర్వాత అర్జునుడు యాగాశ్వానికి సంరక్షకుడిగా మణిపురి రాజ్యానికి చేరుకుంటాడు. అప్పటికి రాజుగా ఉన్న బబ్రువాహనుడు అశ్వాన్ని బంధించి అర్జునుడితో యుద్ధం చేస్తాడు. తాము తండ్రీ కొడుకులమనే విషయం ఇద్దరికీ తెలియదు.బబ్రువాహనుడి చేతిలో అర్జునుడి ప్రాణాలు కోల్పోతాడు. మరణించిన వ్యక్తి తన తండ్రి అర్జునుడని తెలుసుకున్న బబ్రువాహనుడు పశ్చాతాపంతో కుమిలిపోతాడు. తన సవతి తల్లి నాగ కన్య ఉలూపి వల్ల అర్జునుడి ప్రాణం పోసుకుంటాడని తెలుసుకుని ఆమెను ప్రార్థిస్తాడు. అతడి ప్రార్థనలకు ప్రత్యక్షమైన ఉలూపి నాగమణితో అర్జునుడికి ప్రాణం పోస్తుంది. భారత యుద్ధంలో బీష్ముడిని మోసం చేసి అర్జునుడు హతమార్చాడని ద్వేషంతో అతడి సోదరుడు వసుసు కొడుకు చేతిలో నీకు మరణం తథ్యమని శపించాడు. ఆ శాపఫలితమే బబ్రువాహనుడు చేతిలో అర్జునుడి ఓటమి, మరణానికి కారణం.
జీవితంలో ఎల్లప్పుడూ ఈ 12 విషయాలు గుర్తుపెట్టుకోండి.
సమయం విలువ, శ్రమకు దక్కే ఫలం, నిరాడంభరానికి లభించే గౌరవం, సౌషీలానికి ఉండే విలువ, కరుణకు ఉండే శక్తి, ఆచరణ ద్వారా పొందే జ్ఞానం, విధినిర్వణలో నిరంతర భాద్యత, పిలుపులో వివేకం, ఓర్పు వహించటంలో ఉండే సుగుణం, ప్రతిభకు పదును పెట్టటం, సృజనాత్మకతలో ఆనందంవీటిని మరవకుండ జీవించు వారిని లోకులు ఎన్నటికీ మర్చిపోలేరు. మానవులకు ఉన్న పెద్ద భ్రమ ఏదంటే అన్ని రకాల కష్ట సుఖాలను కేవలం డబ్బు మాత్రమే ఇస్తుంది అనుకోవటం. అనుభవించ లేని సంపాదన అనర్థాలకు దారితీస్తుంది అని మరిచిపోవడం.మనసారా నవ్వటం, కంటినిండా నిద్రించడం, ఏమితిన్న అరిగించుకునే ఆరోగ్యం ఇవి ఉంటే అన్ని సంపదలు మనవద్ద ఉన్నట్టే…..
8. నేటి సుభాషితం
తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు,కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు, ఏ పని అల్పమైనది కాదు
నేటి జాతీయం
కొండలు పిండి చేయు
చాల కష్టమైన పని అని అర్థం
ఉదా: వాడు చాల బలవంతుడు: కొండలను సైతం పిండి చేయగలడు.
9. నేటి సామెత నూరు చిలుకల ఒకటే ముక్కు
పల్లె ప్రాంత ప్రజల ఉహా ధోరణి విచిత్రంగా ఉంటుంది. వారికి తెలిసిన వస్తువులను వారికి తెలిసిన వాటితో పోల్చి చెపుతుంటారు. ఈ పొడుపు కథ కూడా అలా ఒక వస్తువుతో పోల్చి చెప్పుకొనగా ఉద్భవించినదే. నూరు చిలకలు ఉంటే వాటికి ఒకటే ముక్కు ఉండటం సృష్టిలో చాలా విచిత్రమైన విషయమే. ద్రాక్షపండ్ల గుత్తిలోని ద్రాక్ష పళ్ళన్నీ పచ్చగా గుత్తిగా ఒద్దికగా ఒకే చోట ఉండటం పొడుపు కథ. ద్రాక్ష పళ్ళన్నీ చిలకలుగా వాటిని కలుపుతూ ఉన్న ఒకే తొడిమ ముక్కుగా సృష్తికర్త భావం. అందుకే దీనిని విడుపు ద్రాక్ష గుత్తి అంటుంటారు.
10. శుభోదయం
మహానీయుని మాట
” కలుపుకు పోయే
మంచితనం నీలో ఉంటే
అందరూ నీ వెంటే
ఉంటారు. నాకే
తెలుసుననే అహం
నీకుంటే
సంఘం, సమాజమే
నిన్ను దూరం చేస్తుంది ”
11. శ్రీరస్తు శుభమస్తు
తేది : 23, అక్టోబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజమాసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : సౌమ్యవాసరే (బుధవారం)
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 33 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 9 ని॥ వరకు దశమి తిధి తదుపరి ఏకాదశి తిధి)
నక్షత్రం : ఆశ్లేష
(నిన్న సాయంత్రం 4 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 13 ని॥ వరకు ఆశ్లేష నక్షత్రం తదుపరి మఖ నక్షత్రం )
యోగము : (శుభం ఈరోజు సాయంత్రం 4 గం ll 57 ని ll వరకు తదుపరి శుక్లం రేపు మధ్యాహ్నం 1 గం ll 36 ని ll వరకు)
కరణం : (వణిక్ ఈరోజు మధ్యాహ్నం 2 గం ll 21 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మధ్యాహ్నం 12 గం ll 0 ని ll )
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 11 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 13 ని॥ వరకు)
దుర్ముహూ : (ఈరోజు ఉదయం 11 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 10 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 27 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 0 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 12 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : కర్కాటకము
వృశ్చికాయనం ఈరోజు రాత్రి 10 గం ll 51 ని ll హరిపదం
12. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.
13. నేటి నుండి 25వ తేదీ వరకు
చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 23 నుండి 25వ తేదీ వరకు బాలాలయ జీర్ణోద్ధరణ, మహా సంప్రోక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అక్టోబరు 23వ తేదీ సాయంత్రం వాస్తుపూజ, విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణంతో బాలాలయ జీర్ణోద్ధరణ ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబరు 24వ తేదీ ఉ9దయం 7.30 నుండి 11.00 గంటల వరకు కలపకర్షణ, చతుష్టార్చన, శయ్యాధివాసం, జలధివాసం, సాయంత్రం 5.00 గంటలకు శయ్యాధి కర్మాంగ స్నపనం నిర్వహిస్తారు. అక్టోబరు 25వ తేదీ ఉదయం 8.00 నుండి 10.30 గంటల వరకు ద్వారా పూజ, మహా శాంతి హోమం, మహా శాంతి అభిషేకం, పూర్ణాహుతి, మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు.
14. ఈనెల 26వ తారీఖున శని త్రయోదశి ధన త్రయోదశి ఒకే రోజు వస్తున్నాయి ఆవేళ మాసశివరాత్రి కూడా నరకచాతుర్ది కూడా(తిది ద్వయం ఆవేళ త్రయోదశి మరియు చతుర్దశి ఉన్నవి) ఆ వెళ ఇటువంటి మహత్తరమైన దినం
ధన త్రయోదశి రోజు మన పెద్దలు చెప్పిన ప్రకారం మనము చేసే దానం, ధర్మం, జపం, తపము, అక్షయము అవును అని పెద్దల వాక్కు ఇటువంటి మహత్తరమైన దినమున శని త్రయోదశి సంభవించుట ఆ దినమున శనీశ్వర పూజ జరుపుకొనుట వలన అక్షయ ఫలితాన్ని పొందుతారు పై విషయమును గమనించగలరు.
ఏల్నాటి శని
వృశ్చిక రాశి
విశాఖ 4వ పాదం
అనూరాధ 1 2 3 4 పాదాలు
జ్యేష్ట 1 2 3 4 పాదాలు
ధనుస్సు రాశి
మూల 1 2 3 4 పాదాలు
పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు
ఉత్తర 1వ పాదం
మకర రాశి
ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు
శ్రవణం 1 2 3 4 పాదాలు
ధనిష్ట 1 2 పాదాలు
అష్టమ శని.
వృషభ రాశి
కృత్తిక 2 3 4 పాదాలు
రోహిణి 1 2 3 4 పాదాలు
మృగశిర 1 2 పాదాలు
అర్ధాష్టమ శని
కన్యా రాశి
ఉత్తర 2 3 4 పాదాలు
హస్త 1 2 3 4 పాదాలు
చిత్త 1 2 పాదాలు
పై రాశులు వారు శనీశ్వరునికి తైలాభిషేకం జరిపించుకొని శనీశ్వరుని ప్రభావం నుండి విముక్తులు కాగలరని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు..
15. రాశిఫలం-23/10/2019
తిథి:
బహుళ దశమి రా.8.47, కలియుగం-5121 .శాలివాహన శకం-1941
నక్షత్రం:
ఆశ్రేష ఉ.11.54
వర్జ్యం:
రా.11.07 నుండి 12.36 వరకు
దుర్ముహూర్తం:
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం:
మ.12.00 నుండి 1.30 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం పొందుతారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శత్రుబాధలుండే అవకాశం వుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. అన్నివిషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదావేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృధా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయ. కీళ్ళనొప్పుల బాధనుండి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగివుంటారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతోనే కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
16. పంచాంగం 23.10.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: ఆశ్వయుజ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: దశమి రా.09:29 వరకు
తదుపరి ఏకాదశి
వారం: బుధవారం (సౌమ్య వాసరే)
నక్షత్రం: ఆశ్లేష ప.12:42 వరకు
తదుపరి మఘ
యోగం: శుభ, శుక్ల
కరణం: వణిజ
వర్జ్యం: రా.11:53 – 01:22
దుర్ముహూర్తం: 11:37 – 12:23
రాహు కా: 12:00 – 01:27
గుళిక కాలం: 10:33 – 12:00
యమ గండం: 07:38 – 09:05
అభిజిత్ : 11:37 – 12:23
అమృత కాలం: ప.01:42 – 03:13
సూర్యోదయం: 06:11
సూర్యాస్తమయం: 05:49
వైదిక సూర్యోదయం: 06:14
వైదిక సూర్యాస్తమయం: 05:45
చంద్రోదయం: రా.01:04
చంద్రాస్తమయం: ప.02:19
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కర్కాటకం
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: ఉత్తరం
17. 26 కోట్ల చిల్లర నాణేలు మార్పిడి చేసిన టీటీడీ
తిరుమల శ్రీనివాసుడికి మొక్కుల రూపంలో భక్తులు హుండీల్లో సమర్పించే చిల్లర నాణేల మార్పిడిపై టీటీడీ దృష్టి పెట్టింది. గడిచిన రెండు నెలల్లో రూ.26 కోట్ల కాయిన్స్ ను మార్పిడి చేసింది. మరో రూ.5 కోట్లు మార్పిడికి చర్యలు వేగవంతం చేసింది. కొంతకాలంగా చిల్లర నాణేలు పరికామణిలో పేరుకున్నాయి. టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చొరవ తీసుకుని మార్పిడిపై చర్యలు చేపట్టారు. బ్యాంకర్లు హుండీల్లో ఎంత చిల్లర సేకరిస్తే అంతే మొత్తంలో నగదు డిపాజిట్ చేసేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల ఎప్పటికప్పుడు చిల్లర నాణేలను బ్యాంకర్లు డిపాజిట్ రూపంలో మార్పిడి చేసుకుంటున్నారు.
18. సింగపూర్‌లో ఘనంగా శ్రీనివాస కల్యాణం
సింగపూర్ తెలుగు సమాజం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని సింగపూర్ లోని పాయ లేబర్, శ్రీ శివన్ దేవాలయం ప్రాంగణంలో జరిపించారు. మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రభాత సేవతో మొదలై ఏకాంత సేవ వరకు జరిగిన విశేషసేవలకు భారీగా భక్తులు తరలి వచ్చారు. సింగపూర్‌తో పాటు మలేషియా నుండి కూడా అనేకమంది భక్తులు వచ్చి తిరుమల ఉత్సవ అనుభూతిని పొందారు. కన్నుల పండగగా జరిగిన ఈ ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, చిన్నారుల నాట్యాలు, మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అతి తక్కువ సమయంలో అత్యంత వేడుకగా కళ్యాణమహోత్సవాన్ని చేయడంలో కీలక పాత్ర వహించిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గాన్ని కొనియాడారు. తిరుమల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి టీటీడీ కార్యవర్గం చర్యలు తీసుకుంటుందన్నారు. విదేశాల నుండి వచ్చే భక్తుల కోసం మరింత శీఘ్రగతిన దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ బోర్డ్ మెంబర్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. మాట్లాడుతూ సింగపూర్‌లో ఎన్నో దేవాలయాలు ఉండడం ఆనందంగా ఉందని, ఇక్కడి భారతీయుల భక్తి ఎంతో స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఈకార్యక్రమంలో సింగపూర్ హోమ్, న్యాయశాఖా మంత్రివర్యులు కె షణ్ముగం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు యస్ ఈశ్వరన్, సింగపూర్ దేశ భారత రాయభారి జావెద్ అష్రాఫ్, హిందూ ఎండోమెంట్ బోర్డ్ ఛైర్మన్ ఆర్ జయచంద్రన్, శివన్ దేవాలయ సలహాదారు దినకరన్, శివన్ దేవాలయ ఛైర్మన్ వెంకటేష్, శివన్ దేవాలయ కార్యదర్శి టి అన్బలగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ సావనీర్ ను ప్రముఖుల చేతులమీదుగా ఆవిష్కరించారు.పుష్కర కాలం తర్వాత ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని సింగపూర్‌లో నిర్వహించడానికి తోడ్పాటునందించిన టీటీడీ యాజమాన్యానికి, స్థానిక హిందూ ఎండోమెంట్ బోర్డు, శివన్ టెంపుల్ యాజమాన్యానికి సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సింగపూర్ భక్తులకి ఈ కార్యక్రమం ద్వారా కలగడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.