Politics

జగన్‌కు 100కు 150మార్కులు

JC Diwakara Reddy Comics On YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది.. 100కి 150 మార్కులు వెయ్యాలని సెటైర్ వేశారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తమ అబ్బాయే అన్నారు. అయితే పరిపాలనలో కిందామీద పడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఎన్నో ట్రావెల్స్ బస్సులుండగా ఆయనకి తమ బస్సులే కనిపిస్తున్నాయని.. ఇప్పటి వరకు 31 బస్సులు సీజ్ చేశారన్నారు. ప్రభుత్వ చర్యలపై న్యాయపరంగా పోరాడతామన్నారు. 70ఏళ్ల నుంచి వాహనరంగంలో ఉన్నామని.. చిన్న చిన్న లోటు పాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమన్నారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారని.. ఫైన్‌లతో పోయే తప్పిదాలకు సీజ్ చేయటం ఎంతవరకు సబబు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకే.. తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. చూసే వారి కళ్లను బట్టి రాయలసీమ అభివృద్ధి ఉంటుందని..ఎవరికి వాళ్లు తమ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకోవడంలో తప్పులేదన్నారు. చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని.. ఎన్ని వర్షాలు పడినా ప్రాజెక్టులు లేకపోతే ఫలితం శూన్యమని జేసీ వ్యాఖ్యానించారు.