Fashion

ఉసిరితో యవ్వనవంతమైన చర్మం

Telugu Traditional Fashion & Beauty Tips - Amla For Natural Glowing Skin

ఉసిరి ఆరోగ్యానికేకాదు.. అందానికీ ఎంతో మేలు చేస్తుంది. ఉసిరి, కుంకుమ పువ్వుతో చర్మాన్ని మెరుగుపర్చుకోవచ్చు.ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపర్చుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ముడతలు తొలగుతాయి. ఉసిరిపొడిలో కొంచెం మజ్జిగ, కోడిగుడ్డు తెల్లసొన, బాదం పేస్ట్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు. కుంకుమపువ్వులో మనకు మేలు చేసే విటమిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. దీనివల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా తయారవుతుంది. కుంకుమ పువ్వు, పాల మిశ్రమం ఫేస్‌ప్యాక్‌ చర్మంలో కొల్లాజన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. స్కిన్‌ స్ట్రక్చర్‌ను మెరుగుపరుస్తుంది. ఇది చర్మం మరింత యవ్వనంగా కనబడేలా చేస్తుంది. కలబంద చర్మ సౌందర్యానికి వన్నె తెస్తుంది. దీని గుజ్జు చర్మంపై ఎప్పుడూ తేమను ఉంచుతుంది. అంతేకాదు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.సి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి మూడు సార్లు ఇలాచేస్తే ముఖం అందంగా కనబడుతుంది.