* నిర్మాతగా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన బండ్ల గణేష్‌కు కడప కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. నవంబర్ 4 వరకూ ఆయన రిమాండ్ కొనసాగనుంది. గురువారం ఆయన కడప కోర్టుకు హాజరయ్యారు. బండ్ల గణేష్‌ఫై కడప జిల్లా మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు. కానీ గత కొంతకాలంగా ఆయన కోర్టుకు హాజరు కావడం లేదు.
* బల్గేరియా నుంచి వచ్చిన ఓ ట్రక్కులో 39 మృతదేహాలు బయటపడిన ఘటన లండన్‌లో జరిగింది. గ్రేస్ ఏరియా ఆఫ్ ఎసెక్స్ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని మృతదేహాలను చూసి విస్తుపోయారు. వేల్స్‌లోని హోలీహెడ్ రేవు గుండా ఈ ట్రక్ శనివారం లండన్‌లో ప్రవేశించినట్టు పోలీసులు గుర్తించారు. ట్రక్కులోని మృతదేహాలు ఎవరివి? వారెలా మృతి చెందారు? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నార్త్ ఐర్లండ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
* అమాయకురాలైన ఓ బాలికను మాయమాటలతో మభ్యపుచ్చాడు. ప్రేమపేరుతో నాటకమాడి గర్భం చేసి విదేశాలకు పరారైన ఓ మోసగాడి ఉదంతం కడప జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. పుల్లంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించాడు. బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో విదేశాలకు పారిపోయాడు. జరిగిన మోసాన్ని తెలుసుకొన్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గర్భిణి అయిన బాలికను పుల్లంపేటకు చెందిన వైద్య సిబ్బంది ఆదరించారు. నెలలు నిండడంతో ఆమెను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో మగబిడ్డను ప్రసవించింది.
* జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చిన గణేశ్ ను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు టెంపర్ సినిమా నిమిత్తం నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వద్ద డబ్బులు తీసుకుని, తిరిగి చెల్లించలేదన్న కేసులో పోలీసుల విచారణకు వచ్చిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ను, పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. ఐదేళ్ల క్రితం 2014, అక్టోబర్ 1న కడప ప్రాంతానికి చెందిన మహేశ్ అనే వ్యాపారి నుంచి రూ.10 లక్షలు అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వలేదన్న కేసు ఆయనపై నమోదు కాగా, ఆ కేసులో పోలీసులు అరెస్ట్ చూపించారు.
* ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో ఆంధ్ర బ్యాంకు లో దొంగలు చోరీకి యత్నించారు. కిటికి సువ్వలు తొలగించి దొంగలు చోరికి ప్రయత్నించారు. . బ్యాంకు లో అలారం మ్రోగడంతో దొంగలు పరారైయ్యారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ ప్రసన్న కుమార్, సీఐ వసంత్ కుమార్, ఎస్ఐ నరేష్ లు పరిశీలించారు. సంఘటన స్థలంలో డ్యాగ్ స్వ్కాడ్, వేలిముద్ర నిపుణులతో పోలీసుల పరిశీలించారు.
* ఎన్టిపిసి లోకి ఆర్టీపిపి నివిలీనం మాకొద్దు అంటూ.. ఆర్టీపిపి కార్యాలయం మెయిన్ గేటు వద్ద బైఠాయించి ఆర్టీపిపి ఉద్యోగులు గురువారం నిరసన చేపట్టారు. నిరసన అనంతరం కేంద్ర ఎన్టీపిసి బఅందానికి ఆర్టీపిపి ఉద్యోగులు వినతిపత్రాన్ని అందచేశారు. ఆర్టీపిపి లో టెక్నికల్ విజిట్ కు మాత్రమే వచ్చామని ఆర్టీపిపి ఉద్యోగులకు ఎన్టీపిసి బఅందం తెలిపింది.
బండ్ల గణేశ్‌కు నవంబర్ 4 వరకు రిమాండ్-నేరవార్తలు-10/24
Related tags :