Politics

29నుండి కృష్ణా జిల్లా తెదేపా సమీక్ష

Krishna District TDP Review Meetings From 29th October

ఈ నెల 29,30,31న విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా కార్యకర్తలతో సమావేశం అవుతారు..

29వ తేది ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ విస్త్రుతస్థాయి సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి గ్రామ/వార్డు/మండల/జిల్లా స్థాయి కమిటీలు, అనుబంధ సంఘాలు, ఏరియా కమిటీ కోఆర్డినేటర్లు, బూత్ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, అన్ని స్థాయిల్లోని మాజీ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అవుతారు. .

విస్త్రుతస్థాయి సమావేశం అనంతరం అదే రోజు భోజన విరామ అనంతరం పెడన, కైకలూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం జరుగుతుంది.

30వ తేదిన ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయించబడిన బాధితులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారు.

అదే రోజు భోజన విరామం అనంతరం అవనిగడ్డ, నందిగామ, పామర్రు, నూజివీడు, గుడివాడ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు జరుగుతాయి.

31వ తేదీ ఉదయం 10 గంటల నుండి విజయవాడ సెంట్రల్, పెనమలూరు, భోజన విరామ అనంతరం విజయవాడ పశ్చిమ, గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు జరుగుతాయి.