లండన్‌లోని ఎసెక్స్‌కు చెందిన గ్రేస్ ప్రాంతంలో ఓ లారీలో పట్టుబడిన 39 మృతదేహాలు చైనీయులవని తెలుస్తోంది. వారిలో 38 మంది పెద్దవారు, ఒక టీనేజర్ ఉన్నట్లుగా ఎసెక్స్ పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. మృతదేహాల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు వెల్లడించారు. నిన్న మృతదేహాలతో పట్టుబడిన లారీని పోలీసులు సమీపంలో టిల్‌బరీ డాక్స్ అనే ప్రాంతానికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే లారీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయినవారంతా చైనీయులా? కాదా? అనే విషయంపై ఎసెక్స్ పోలీసులు, చైనా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. 2000 సంవత్సరంలో చైనాకు చెందిన 58 మంది మృతదేహాలను డచ్‌కు చెందిన లారీలో డోవర్ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు.
లారీ నిండా చైనీయుల శవాలు
Related tags :