Politics

చంద్రబాబు దెబ్బకు హైకోర్టుకే దిమ్మతిరిగింది

AP High Court Shocked To Learn Chandrababu Spent 10Crores On One Day Protest In Delhi-చంద్రబాబు దెబ్బకు హైకోర్టుకే దిమ్మతిరిగింది

ఒక్క రోజు దీక్ష కు రూ 10 కోట్లా ..!!

_ ఏ అధికారంతో ఖర్చు చేసారు

_ చంద్రబాబు దీక్ష ఖర్చుపై హైకోర్టు విస్మయం.

_ రాజకీయంగానూ పెద్ద ఎత్తున విమర్శలు..

ముఖ్యమంత్రి హోదాలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న చంద్రబాబు ఢిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు రూ.10 కోట్ల ప్రజాధనం ఖర్చుచేయడంపై రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది.

అసలు ఏ చట్ట నిబంధన కింద ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ నిధులను విడుదల చేసిన అధికారులు ఎవరంటూ ఆరా తీసింది.

ఇలా ప్రజాధనాన్ని వృథా చేసే హక్కు ఎవ్వరికీ లేదంటూ వ్యాఖ్యానించింది.

ఆ పది కోట్ల రూపాయల్ని కేటాయిస్తూ జీవో విడుదల చేసిన అధికారి ఎవరు.. ఏ నిబంధనల మేరకు జీవో విడుదల చేశారని కోర్టు నిలదీసింది.

సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాకు ఇంత భారీ స్థాయిలో ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించింది.

దీనిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు.

ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చడం లేదంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 11న సీఎంగా ఉన్న చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఒక్కరోజు ధర్మపోరాట దీక్షకు రూ.10 కోట్లు వ్యయం చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

ఇంత వ్యయం చేయడాన్ని సవాల్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వేటుకూరి ఏవీఎస్‌ సూర్యనారాయణరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

దీనిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..

ఇది కేవలం అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేపట్టిన దీక్ష అని, ఇందుకు ప్రజా ధనాన్ని వినియోగించడం సరి కాదని పేర్కొన్నారు.

ఈ సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాధనాన్ని వృథా చేసే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో రూ.10కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఢిల్లీలో ఒకరోజు ధర్నా నిర్వహించారని వివరించారు.

వెంటనే ధర్మాసనం.. ఒక్కరోజు ధర్నాకు రూ.10 కోట్లా..అంటూ విస్మయం వ్యక్తంచేసింది.

ఆ డబ్బంతా కూడా పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది.

ఇలా ప్రజాధనాన్ని రాజకీయ కార్యక్రమాల కోసం విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుందని నిలదీసింది.

ఇది చాలా తీవ్రమైన విషయమంది. అసలు ఏ చట్టం కింద.. ఏ నిబంధనల కింద ఆ రూ.10 కోట్లు విడుదల చేశారని ప్రశ్నించింది. ఇందుకు బాధ్యులెవరని ప్రశ్నించింది.

ఏ అధికారంతో అంత భారీ నిధులను ఓ ధర్నా కోసం ఇచ్చారో వివరిస్తూ పూర్తి వివరాలను కౌంటర్‌ రూపంలో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించి విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసింది.

చంద్రబాబు నాడు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం పేరుతో ఢిల్లీలో చేసిన దీక్షకు విడుదల చేసిన నిధుల మీద రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తాయి.

బీజేపీ నేతలు సైతం ప్రజా ధనం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి దీక్ష పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు.

అయితే, ఇదే సమయంలో ఆ నిధులు ఢిల్లీలోని టీటీడీ నుండి బదలాయించిన నిధులనే ఆరోపణలు ఉన్నాయి.

దీని మీద టీటీడీ విజిలెన్స్ విచారణ సాగుతోంది. ఇదే సమయంలో కోర్టు సైతం ఈ అంశం మీద విచారణ ప్రారంభించింది.

ఇప్పుడు కోర్టు కీలక వ్యాఖ్యలు చేయటంతో పాటుగా వివరిస్తూ పూర్తి వివరాలను కౌంటర్‌ రూపంలో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.