ప్రపంచంలో ‘అపర కుబేరుడు’ అన్న ట్యాగ్‌ను అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కోల్పోయారు. ఆయన స్థానంలోకి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వచ్చి చేరారు. గురువారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో బెజోస్ 7 మిలియన్ల డాలర్ల స్టాక్ విలువను పోగొట్టుకున్నారు. గురువారం ట్రేడింగ్‌లో ఆయన షేర్ల విలువ 7 శాతం పడిపోయింది. దీంతో ఆయన సంపద 103.9 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడింది. బిల్ గేట్స్ ప్రస్తుతం సంపద 105.7 బిలియన్ డాలర్లు. ఏడాది క్రితం వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా గేట్స్ ఉండగా.. 2018లో తొలిసారిగా బెజోస్ ఆస్థానంలో నిలిచారు. ఆ సంవత్సరం ఆయన సంపద 160 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంతకు ముందున్న అత్యధిక సంపద రికార్డులను బెజోస్ చెరిపేసి సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే, గురువారం వెల్లడైన మూడో త్రైమాసిక ఫలితాల్లో అమెజాన్ షేర్ విలువ 26 శాతం పడిపోయినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గత రెండేళ్లలో ఇలా షేర్ విలువ పడిపోవడం ఇదే తొలిసారి. 1987లో తొలిసారిగా బిల్ గేట్స్ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అప్పుడు ఆయన మొత్తం సంపద విలువ 1.25 బిలియన్ డాలర్లు. తర్వాత ఏడాది జెఫ్ బెజోస్ కూడా ఫోర్బ్స్-400 అత్యంత ధనికుల జాబితాలో చేరారు. 1998లో ఆయన సంపద 1.6 బిలియన్ డాలర్లుగా ఉండేది. బెజోస్ తన భార్య మెకంజీ బెజోస్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 39 బిలియన్ డాలర్ల సంపదను ఆమెకు భరణం కింద చెల్లించారు. దీంతో బెజోస్ సంపద కాస్త తరిగింది.
బిల్‌గేట్స్ రిటర్న్స్ బ్యాక్
Related tags :