Movies

బుర్రిపాలెంపై భారతితో భేటీ

Namrita Meets YS Bharati And Requests Support To Help Develop Burripalem

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతితో అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు భార్య నమ్రత భేటీ అయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న నమ్రత.. భారతిని కలిసి పలు సామాజిక కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్‌ వివరాలను గురించి భారతితో చర్చించారు. ఇప్పటికే మహేశ్‌బాబు గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే బుర్రిపాలెంలో జరుగుతున్న అభివృద్ధి, పలు సంక్షేమ కార్యక్రమాలను గురించి కూడా ఆమె భారతికి వివరించారు. అంతేకాకుండా ఆ గ్రామం అభివృద్ధికి సహకరించాలని భారతిని కోరారు. మరోవైపు మహేశ్‌ తెలంగాణలోని సిద్ధాపూర్‌ గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు.