తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో కీలకపాత్ర పోషించారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్. ప్రస్తుతం ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. వెంకటేశ్ కథానాయకుడిగా ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సురేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం చిత్రబృందం నవాజుద్దీన్‌ను సంప్రదించినట్లు సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం వెంకటేశ్ ‘వెంకీమామా’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్-నాగచైతన్య మామా అల్లుళ్లుగా కనిపించనున్నారు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో వెండితెరకు కథానాయకుడిగా పరిచయమవుతున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్‌లోకి నవాజుద్దీన్
Related tags :