*తమిళనాడు రాష్ట్రం తిరుచురాపల్లి జిల్లాలో బోరుబావిలో రెండున్నరేళ్ల చిన్నారి పడ్డాడు. బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం సుజిత్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం అక్కడికి చేరుకుంది. బోరుబావిలోకి కెమెరాలను పంపి పరిశీలించగా బాలుడి కదలికలు కనిపించాయి. చిన్నారిని సురక్షితంగా బయటకి తీసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఐఐటీ మద్రాసు తయారుచేసిన ప్రత్యేక పరికరం సహాయంతో రక్షించేందుకు యత్నిస్తున్నారు.
* కిలాడి గ్యాంగ్ విసిరిన హానీ ట్రాప్ ఉచ్చులో పలువురు విశాఖ వాసులు చిక్కుకున్నారు. వారి మాటలకు పడిపోయి లక్షలు సమర్పించుకుని, లబోదిబో మంటున్నారు. ఫేక్ డేటింగ్ సైట్లతో కిలాడి గ్యాంగ్ జనాలను ట్రాప్ చేస్తోంది. కోల్ కతా కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది బలవుతున్నారు.
* కృష్ణాజిల్లా చాట్రాయి మండలం మంకోల్లులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు జలాశయంలోకి ఆత్మహత్యాయత్నం చేయగా ప్రేయసి నాగమణిని స్థానికులు కాపాడారు. యువకుడు సురేష్ గల్లంతయ్యాడు. బాధితులిద్దరూ పశ్చిమగోదావరి జిల్లా ప్రగడవరానికి చెందిన వారిగా గుర్తించారు
* బక్రిచెప్ట్యాల వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ అంబులెన్స్‌ను డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.
* అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలుపట్టాలపై నాలుగు మృతదేహాలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళ మృతదేహాలు పట్టాలపై పడి ఉండడాన్ని చూసి పోలీసులకి సమాచారం ఇచ్చారు స్థానికులు.
* గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను మోసం చేశాడనే కోపంతో ఓ అమ్మాయి యువకుడిపై యాసిడ్‌తో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
* సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ సమీపంలోని పొన్నాల పెట్రోల్ బంక్ వద్ద హైవేపై అంబులెన్స్, డీసీఎం ఢీ కొంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయలైన వారిని ఆస్పత్రికి తరలించారు.
*కిలాడి గ్యాంగ్ విసిరిన హానీ ట్రాప్ ఉచ్చులో పలువురు విశాఖ వాసులు చిక్కుకున్నారు. వారి మాటలకు పడిపోయి లక్షలు సమర్పించుకుని, లబోదిబో మంటున్నారు. ఫేక్ డేటింగ్ సైట్లతో కిలాడి గ్యాంగ్ జనాలను ట్రాప్ చేస్తోంది.
*కృష్ణాజిల్లా చాట్రాయి మండలం మంకోల్లులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు జలాశయంలోకి ఆత్మహత్యాయత్నం చేయగా ప్రేయసి నాగమణిని స్థానికులు కాపాడారు. యువకుడు సురేష్ గల్లంతయ్యాడు. బాధితులిద్దరూ పశ్చిమగోదావరి జిల్లా ప్రగడవరానికి చెందిన వారిగా గుర్తించారు
*బక్రిచెప్ట్యాల వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ అంబులెన్స్‌ను డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తుర్కపల్లికి చెందిన రాణి(40), గజ్వేల్‌కు చెందిన సునీత(35)గా గుర్తించారు. బంధువుల మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకువస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది
*దీపావళి రోజు అమావాస్య సందర్భంగా ఆదివారం సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ ముగిసిన తర్వాత రాత్రి 7 గంటలకు కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు.
మర్నాడు ఉదయం తెల్లవారుజామున యథావిధిగా దేవస్థానాన్ని తెరుస్తారు.
*ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందున్న ఇనుప తీగపై బట్టలు ఆరేస్తున్న ఓ మహిళ విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు కోడళ్లూ ప్రాణాలు విడిచారు.
*ఆపదలో ఆదుకోవాల్సిన 108 వాహనం రాలేదు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యుడు లేరు. దాంతో విద్యుదాఘాతానికి గురైన రైతు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నుసికొట్టాలలో శుక్రవారం చోటుచేసుకుంది.
*దీపావళిని ఉన్నంతలో ఘనంగా చేసుకోవడానికి బయలుదేరిన అభాగ్యులు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారి కుటుంబాలకు చీకట్లు మిగిల్చింది.
*మాటలు రాని మానసిక వికలాంగురాలైన బాలికపై 34 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎం.నారాయణ (34)ఒంటరిగా ఉంటున్నాడు. అతని నివాసానికి సమీపంలో బాలిక ఉండేది. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం రాత్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
*నకిలీ ఈమెయిల్ సృష్టించారన్న ఫిర్యాదుతో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై నమోదైన కేసులో శుక్రవారం ఆయనకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ.15 వేలు వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అదే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు తీసుకుని తక్షణం బెయిలు మంజూరు చేయాలని కూకట్పల్లి 9వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
*ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో చిత్రాలతో కూడిన అభ్యంతరకర సందేశాలు పంపిన ఆరుగురిపై కేసు నమోదు చేసిన సంఘటన ఇది. బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో ఉంటున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన తోడే వెంకటకృష్ణారెడ్డి బెల్లంపల్లి నియోజకవర్గం పేరుతో, బెల్లంపల్లికి చెందిన యాదండ్ల బాలుయాదవ్, యాదండ్ల వెంకటేష్లు యంగ్స్టార్ పేరుతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు.
*పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థి పాలిట శాపమైంది. నిజామాబాద్ నగరం కోటగల్లీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (పులాంగ్)లో.. 5వ తరగతి విద్యార్థి అయాన్ఖాన్ (11) విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
*విజయవాడ ఏలూరు రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. తాడేపల్లిగూడెంకు చెందిన కారు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న క్రమంలో అర్ధరాత్రి గుణదల కూడలిలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి అక్కడే పార్కు చేసిన మూడు కార్లపైకి దూసుకెళ్లింది.
*గంజాయిని గుట్టుగా సరఫరా చేసే వ్యక్తులు తమ ద్విచక్రవాహనాలపై ఏకంగా ఆ దందాను సూచించే రేడియం స్టిక్కర్లు వేయించుకుని తిరుగుతున్న వైనమిది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం వెలుగుచూసింది.
*రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో 10వ తరగతి విద్యార్ధి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి వెంటిలేటర్కు తాడుతో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. మధ్యాహ్న భోజనానికి వచ్చి దుకాణంలో ఉన్న తన దగ్గర ఇంటి తాళం చెవి తీసుకెళ్లిన కుమారుడు ఎంతకీ తిరిగిరాలేదు.
*భువనగిరి శివారులో కూరపాటి శ్రీదేవి, శ్రీనివాస్లకు చెందిన 9.06 ఎకరాల భూమిని నయీం, ఆయన అనుచరులు గతంలో అక్రమించారు. బెదిరింపులకు గురిచేసి నయీం తల్లి తహేరాబేగం, అక్కచెల్లెళ్లు సలీమాబేగం, అయేషా బేగం, బంధువు సలీంల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
*సంచలనం సృష్టించిన బీమా వైద్య సేవలు(ఐఎంఎస్) కుంభకోణం మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితురాలైన డా.దేవికారాణి డొల్ల కంపెనీ సృష్టించి డబ్బులు కాజేసినట్లు అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు గుర్తించారు.
*రెండో భార్యను తీవ్ర వేధింపులకు గురిచేసి దారుణంగా హత్య చేసిన వ్యక్తి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
*దేశ రాజధాని కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థ దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర పన్నును ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ బుధవారం నాటి సోదాల్లో గుర్తించింది. పన్ను ఎగవేత, హవాలా కార్యకలాపాలు, అక్రమ నగదు చలామణి, డొల్ల కంపెనీ లావాదేవీల సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
*ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత హరీశ్ రావత్పైన, గతంలో ఆయన మంత్రివర్గంలో పనిచేసి, ప్రస్తుతం (భాజపా ప్రభుత్వంలో) మంత్రిగా ఉన్న హరక్సింగ్ రావత్పైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 2016లో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే సమయంలో.. ఎమ్మెల్యేల కొనుగోలుకు వారు చేసిన ప్రయత్నాలు ఓ న్యూస్ఛానెల్ వీడియో టేపుల్లో బయటపడినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు నిర్వహించింది.
*గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్పేట నల్గొండ చౌరస్తాలోని సిటీ టవర్స్ సెల్లార్లో గుర్తుతెలియని వ్యక్తి స్పృహ తప్పి పడి ఉన్నాడు.
*కళాశాలకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
*ముందు వెళ్తున్న ఆటోను వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. మునగాల మండలం మాదవరం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ కారు వెనుక నుంచి బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
*అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో రైలుపట్టాలపై నాలుగు మృతదేహాలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
* జింకను వేటాడబోయి.. చివరకు దాని వల్లే మృత్యుఒడికి చేరాడు ఓ వేటగాడు. వివరాల్లోకెళితే.. అమెరికాలోని ఆర్కాన్సస్ రాష్ట్రానికి చెందిన థామస్ అలెగ్జాండర్(ఒజార్క్ కొండ ప్రాంతంలో జింకల వేటకు వెళ్లాడు. ఓ కొమ్ముల జింకను గమనించిన అతడు.. అదును చూసి దానిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన జింక కిందపడిపోయింది. అది చనిపోయిందని భావించిన థామస్.. జింకను తీసుకువచ్చేందుకు దాని దగ్గరకు వెళ్లాడు. జింకను ఎత్తుకునేందుకు ప్రయత్నించబోగా.. ఊహించని రీతిలో ఆ జింక థామస్‌పై విరుచుకుపడింది. కొమ్ములతో దాడి చేయడంతో థామస్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
బోరు బావిలో పడ్డ చిన్నారి-నేరవార్తలు-10/26
Related tags :