Politics

ఆమె భాజపాలోనే…నేను గుడ్‌బై

Daggubati Decides To Quit Politics And Let Purandeswari Continue In BJP

భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ వైకపాలో ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నిక్జల్లో వైకాపా తన భర్త దగ్గుబాటికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని భాజపాలో ఉంటున్న పురందేశ్వరి ఆమధ్య ఘాటుగా విమర్శించడం చర్చనీయంశామైంది. దీనిపై వైకాపా శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అదే సమయంలో పర్చూరు నియోజకవర్గంలో పలు మార్పులు జరిగాయి. భార్య, భర్త చెరో పార్టీలో ఉంటూ ఇలా విమర్శలు చేసుకోవడం సరికాదన్నా భావన వైకాపాలో ఉంది.ఈ నేపద్యంలో పలు ఊహాగానాలు వచ్చాయి. పురందేస్వరిని కూడా పార్టీలోకి తీసుకు రావాల్సిందిగా జగన్ కోరారని వార్తలొచ్చాయి. అమెరికా నుండి పురందేశ్వరి గురువారం హైదరాబాద్ వచ్చారు. ఆమె హైదరబాద్ వచ్చిన తరువాత రాజకీయ పరిణామాల పై కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు. పురందేశ్వరి భాజపాలో కొనసాగాలనే కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పురందేస్వరిని భాజపాలోకి కొనసాగించి తానూ రాజకీయాల నుంచి తప్పుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నారు. కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పటి వరకు ఆలోచించినప్పటికి తనకోసం మీరు త్యాగాలు చేయవద్దని ఆయన తన తల్లిదండ్రులను కోరినట్లు చెబుతున్నారు. అనుచరులతో సమావేశం తరువాత ఈ అంశంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందించనున్నారు.