Movies

పైరసీ కోరల్లో బిగిల్

Bigil Piracy Versions Hit Movie Hard

బిగిల్‌ చిత్రాన్ని పైరసీ వదల్లేదు. విడుదలైన కొన్ని గంటల్లోనే అనధికారికంగా ఆన్‌లైన్‌లో పూర్తి సినిమా హల్‌చల్‌ చేసింది. ఇది చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.

నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం బిగిల్‌. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్‌ సంస్థ నిర్మించింది. 

మద్రాస్ హైకోర్టు ఆదేశాలను భేఖాతరు చేసి తమిళ్‌రాకర్స్‌ అనే వెబ్‌సైట్‌ పైరసీకి పాల్పడడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పైరసీని  అరికట్టడం సాధ్యం కాదా అన్న చర్చ జరుగుతోంది.