అమెరికాలోని నేపర్‌విల్ నగరం(city of Naperville) అక్టోబర్ 25వ తేదీని డా.మండలి బుద్ధప్రసాద్‌డేగా ప్రకటించింది. గాంధేయవాదిగా,సమాజ సేవకునిగా,మంత్రిగా,ఉపసభాపతిగా వివిధ హోదాల్లో చేసిన సేవలను,తెలుగు భాషా ,సంస్కృతుల పరిరక్షణకు చేస్తున్న కృషిని ప్రస్తుతిస్తూ మేయర్ స్టీవ్ చిరికా అక్టోబర్ 25ను డా.మండలి బుద్ధప్రసాద్ డేగా ప్రకటిస్తూ జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని కమీషనర్ జూడిత్ బ్రాడ్ హెడ్ మండలికి అందజేశారు. భారతి తీర్థ సంస్ద వ్యవస్థాపకులు తాతా ప్రకాశం, జంపాల చౌదరి, శారదపూరణశొంఠి,రామ్ శొంఠి ప్రభృతులు బుద్దప్రసాద్ సేవలను ప్రశంసించారు. అందమైన,పర్యావరణ హితమైన నగరంగా పేరొందిన నాపెరవల్లి నగరం తనను గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధమైన పురస్కారం ఉందని కూడా తాను వినలేదని అన్నారు.
అమెరికాలో మండలి బుద్ధప్రసాద్ డే
Related tags :