దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా జరిగిన ట్రేడింగ్‌లో తొలుత 300 పాయింట్ల వరకూ ఎగబాకిన సెన్సెక్స్.. ముగింపు సమయానికి 194.87 పాయింట్లు పెరిగి 39,250 వద్ద స్థిరపడింది. నిఫ్టి 88 పాయింట్లను సాధించి 11,672కు చేరుకుంది. ఈ సందర్భంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్ సంస్థలకు చెందిన స్టాక్‌లు లాభాల్లో కొనసాగడం మార్కెట్ పెరుగుదలకు కారణమైంది. ఆదివారం సాయంత్రం 6.15 నిమిషాలకు ప్రారంభమైన మూరత్ ట్రేడింగ్ రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ముగిసింది. ఏటా దీపావళి రోజున స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ప్రత్యేక ట్రేడింగ్ జరుపుతున్న సంగతి తెలిసిందే.
సెన్సెక్స్‌కు దీపావళి కళకళ
Related tags :