Videos

కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్

Kamma Rajyamlo Kadapa Redlu Trailer Is Out

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వెల్లడించారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎపిలో త‌ప్ప మిగ‌తా అంత‌టా మార్చి 29న విడుద‌లైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా చేస్తున్నాడు. కాగా చిత్రం చిత్రీకరణ పూర్తై నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపథ్యంలో కథ ఉన్నట్లు సమాచారం. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.