చెన్నై చాకలిపేటలో ఓ వస్త్ర దుకాణ వ్యాపారి పేద ప్రజలకు రుపాయికి చొక్కా, రూ.10కి ఓ నైటీ చొప్పున విక్రయించారు. చాకలిపేటలో ఆనంద్ అనే వ్యక్తి వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. దీపావళి సందర్భంగా 19వ నుంచి 26వ తేదీ వరకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఇలా తక్కువ ధరకు దుస్తులు విక్రయిస్తున్నారు. మొదట కొన్ని రోజులు 50 మందికి మాత్రమే ఈ ఆఫర్ అమలుచేయగా రద్దీ పెరగడంతో 200 మందికి టోకన్లు ఇచ్చి విక్రయించాడు. వీటికోసం వేకువజాము నుంచే ప్రజలు దుకాణం ఎదుట వరుసలో వేచి ఉండి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపారి అనంద్ మాట్లాడుతూ పేద ప్రజలు కూడా ఖరీదైన దుస్తులు ధరించి దీపావళి జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ఇచ్చానన్నారు. ఉచితంగా ఇస్తే దానికి విలువ ఉండదని, అందుకే రుపాయికి చొక్కా, రూ.10కి నైటీ విక్రయించినట్లు చెప్పారు.
చెన్నైలో రూపాయికి ఒక చొక్కా

Related tags :