Agriculture

శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తివేత

Sreeramsagar Dam Gates Opened-Telugu Agricultural News-శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1.19 లక్షల క్యూసెక్కులు ఉండగా.. 1.25 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. కనువిందు చేస్తున్న గోదావరి దృశ్యాలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో లెండి, పూర్ణ, మన్నార్‌, ఆస్నా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అక్కడి ప్రాజెక్టులు నిండుకుండలా మారటం.. వాటి గేట్లు ఎత్తారు. దీంతో శ్రీరాంసాగర్‌కు వరద పోటెత్తింది.