ఇప్పటివరకూ మీరు ప్రభాస్-అనుష్కల గురించి వచ్చిన గాసిప్స్ మాత్రమే చదివారు. వారిద్దరి మధ్య బంధం గురించి వివిధ వేదికలపై ఇరువురూ స్పందించారు. ప్రభాస్ అయితే, కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. ‘మా ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే రెండేళ్లుగా దాచాల్సిన అవసరం లేదు. మేమిద్దరం 11ఏళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్నాం. మా ఇద్దర మధ్య ఉన్న బంధాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఎన్ని చెప్పినా ఇలాంటి రూమర్స్ ఆగవేమో’ అంటూ సమాధానం ఇచ్చాడు. తాజాగా ‘చందమామ’ కాజల్ అగర్వాల్ మాత్రం ‘డార్లింగ్’ ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. అవును మీరు చదివింది నిజమే. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా సినీ తారలతో ఓ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ఆసక్తికర ప్రశ్నలు అడుగుతుంటే సినీ తారలు కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతున్నారు. ‘పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారా’ అని కాజల్‌ను అడగ్గా, ‘అవును త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా’నని చెప్పింది. రామ్‌చరణ్, తారక్, ప్రభాస్‌లలో ‘ఎవరిని చంపుతారు? ఎవరితో రిలేషన్లో ఉంటారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారని మంచు లక్ష్మి సరదాగా ప్రశ్నించగా, అంతే సరదాగా రామ్‌చరణ్‌ను చంపేస్తానని, తారక్‌తో రిలేషన్లో ఉంటానని, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కాజల్ చెప్పుకొచ్చింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్లకు ఇప్పటికే వివాహం కాగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ప్రభాస్ కనపడటంతో కాజల్ అటువైపే ఓటేసింది. అన్నట్లు ఈ ముగ్గురు హీరోలతోనూ కాజల్ ఆడి పాడింది. రామ్‌చరణ్‌తో ‘మగధీర’, ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, ప్రభాస్‌తో ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాల్లో కాజల్ ఆడిపాడింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి.
అవును ప్రభాస్‌ను చేసుకుంటా
Related tags :