‘చిన్నప్పటి నుంచీ నేను చాలా స్ట్రాంగ్. ఎవరికీ భయపడేదాన్ని కాదు. పిచ్చి వేషాలు వేసిన అబ్బాయిలను కొట్టిన సందర్భాలూ చాలానే ఉన్నాయి’’ అని రకుల్‌ప్రీత్ సింగ్ అన్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె ఆర్మీ కుటుంబం నుంచి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! ‘మహిళగా మీలో అంత ధైర్యం ఉండటానికి కారణమేంటి’ అని రకుల్‌ని అడిగితే ‘‘చిన్నతనంలో ఆర్మీకు సంబంధించి నాన్న చెప్పిన కథలు, వృత్తిరీత్యా మేం తిరిగిన ప్రాంతాలు, ఊహ తెలిశాక కళ్లారా చూసిన ఎన్నో సంఘటనలు నాకు ఎంతో నేర్పించాయి. క్రమశిక్షణ అనేది నాకు అలాగే అలవరింది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగల సత్తా నాకుంది. తప్పు చేసిన వాళ్లని ధైర్యంగా ఎదిరించగలను. ఆర్మీ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి పెరగడం వల్లే నాకు ఈ ధైర్యం వచ్చింది. పైగా నేను టామ్ బాయ్‌లా పెరగడంతో ఆ ధైర్యం రెట్టింపు అయింది. నేనే కాదు ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అనుష్క శర్మ, సుస్మితాసేన్ కూడా ఇంతే స్ర్టాంగ్‌గా ఉంటారు’’ అని రకుల్ చెప్పారు.
ఆర్మీ కథల బలం
Related tags :