* బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం భేటీ కానుంది. ఈ భేటీలో 30 కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. అయితే రేపటి బేటీలో అమ్మ ఒడి, రైతు భరోసా, భూకేటాయింపులు, ఉద్యోగాల భర్తీ, ఇసుక కొరత వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, వచ్చేనెల నుంచి ప్రతి రెండు, నాలుగు బుధవారాల్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
* మహిళల భద్రత కోసం ప్రభుత్వ బస్సుల్లో ప్రస్తుతం నియమించిన 3400 మంది మార్షల్స్‌ను 13వేలకు పెంచుతూ దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. నవంబర్ 18న ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
* మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు ఇవాళ ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. కేంద్ర జలసంఘం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నీటిపారుదల అధికారుల సమక్షంలో గేట్ల మూసివేత కార్యక్రమాన్ని చేపట్టారు. సుప్రీంకోర్టు గతంలో తీర్పును వెలువరిస్తూ వర్షాకాలం 120 రోజులు ప్రాజెక్టు గేట్లు తీసిఉంచాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుప్రకారం జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచి ఉంచారు. నేడు మూసివేశారు.
* ఓ వైపు బంగాళాఖాతంలో వాయుగుండం, మరోవైపు అరేబియా సముద్రంలో తుపాను నేపథ్యంలో దక్షిణ భారతావనిలో మేఘాలు కమ్ముకున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
* దిల్లీలో మహిళలు నేటి నుంచి ప్రభుత్వ బస్సుల్లో(డీటీసీ) ఉచితంగా ప్రయాణించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అక్టోబరు 29నుంచి దిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆ హామీని దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు అమలు చేస్తున్నారు
* పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యపరిస్థితి మరింత విషమంగా మారింది. రక్తంలో ప్లేట్‌లెట్‌ల సంఖ్య భారీగా తగ్గినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన గుండెకు సంబంధించిన చికిత్సను నిలివేశారుt
* శ్రీశైలం జలాశయం కి వరద 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటివిడుదల. ఇన్ ఫ్లో :1,లక్ష ల 96,314 క్యూసెక్కులు
అవట్ ప్లో : 1,లక్ష 25 వేల 877 క్యూసెక్కులుజలాశయం పూర్తి స్దాయి నీటినిల్వ సామర్థ్యం : 215. టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ : 214.8450. టిఎంసిలు.జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం : 885. అడుగులుప్రస్తుతం నీటిమట్టం :884.80 అడుగులుశ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
*వచ్చే నెల మూడవ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం వున్నదని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దక్షిణ శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
*రాష్ట్రంలో 5-18 వయసు మధ్య ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరో 876 ఆధార్ నమోదు కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేస్తోంది. ఏడాదిన్నర క్రితం విద్యాశాఖ 467 కేంద్రాలను నెలకొల్పింది.
*కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఛైర్మన్గా ఆర్.కె.జైన్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం గోదావరి నదీ యాజమాన్యబోర్డు ఛైర్మన్గా, పోలవరం ప్రాజెక్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా ఉన్నారు.
*తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన గగన్దీప్సింగ్ కోహ్లీ రూ.25లక్షల చెక్కును శనివారం మంత్రి కేటీఆర్కు ప్రగతిభవన్లో అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలకు ఆదరువుగా ఉండేందుకు ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు.
*డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 3 పొరుగు రాష్ట్రాలకు విస్తరించారు. తీవ్రమైన వ్యాధులకు అక్కడి పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స పొందినా పథకం వర్తించేలా ఉత్తర్వులొచ్చాయి. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్కు చెందిన రోగులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందే అవకాశముంటుంది.
*నేచర్ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచవ్యాప్త టాప్-100 విశ్వవిద్యాలయాల జాబితాలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) చోటు దక్కించుకుంది
*రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో అర్చకులు, ఇతర ఉద్యోగుల వేతనాల కోసం రూ.17.65 కోట్లు విడుదలయ్యాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలల వేతనాల చెల్లింపునకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారు
*రాష్ట్రంలో మిగిలిపోయిన 9,674 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. నవంబరు 1న జిల్లాలవారీగా ప్రకటన జారీచేసి 30లోగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించింది. డిసెంబరు 1 నుంచి కొత్తగా ఎంపికయ్యే వాలంటీర్లు విధులకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులిచ్చింది. 2019 నవంబరు 1 నాటికి 18 ఏళ్లు నిండి 35 ఏళ్లు దాటని పదోతరగతి ఉత్తీర్ణులంతా వాలంటీరు పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
*రక్తనిధి కేంద్రాల ఉద్యోగులకు ‘హెడ్ ఆఫ్ అకౌంట్’ నంబరులో వచ్చిన తేడా వల్ల వేతనాలు అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థికశాఖ, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల మధ్య లోపించిన సమన్వయం తమకు శాపంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఇంజినీర్లుగా కొలువు తీరనున్నారు.
*జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఉపకార వేతనం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. నిధుల మంజూరు నిమిత్తం న్యాయశాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. జీవో జారీకి ముందు 3 సంవత్సరాల లోపు న్యాయవాదిగా పేరునమోదు చేసుకొని ఉన్నవారికి, తాజా జూనియర్లకు 3 సంవత్సరాల పాటు స్టైఫండ్ చెల్లిస్తారు.
30న ఏపీ కేబినేట్ భేటి-తాజావార్తలు-10/29
Related tags :