Devotional

నేటి నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభం

kaartheeka Masam 2019 Begins From Today

1. నేటి నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభం – ఆద్యాత్మిక వార్తలు – 10/29
మంగళవారం నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాల్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైల దేవస్థానాన్ని ఈ మాసంలో మొత్తం 20లక్షలమంది పైగా భక్తులు దర్శిస్తారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. రెండో శనివారం, ఆదివారం వంటి సెలవుదినాలు, సోమవారం, కార్తీకపౌర్ణమి మొదలైన రోజుల్లో లక్షమందికి పైగా వస్తారని తెలిపారు. రద్దీ రోజుల్లో వేకువజామున 4గంటల నుంచి స్వామిఅమ్మవార్ల దర్శ నానికి అనుమతిస్తామని, సుప్రభాతసేవ, మహామంగళహారతి, లక్ష కుంకుమార్చన, నవావరణపూజ, బిల్వార్చన తదితర ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్టు తెలిపారు. ఆర్జిత చండీహోమాలు, రుద్రహోమా లు రెండు విడతలుగా నిర్వహిస్తామన్నారు.భక్తులు దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద, ఆలయం ఎదురు గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కార్తీకమాసంలో ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమి రోజులలో ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామ ని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా త్రివేణి సంఘమ క్షేత్రం కాళేశ్వరంలోని శ్రీ ముక్తీశ్వర స్వామి సన్నిధానంలోనూ కార్తీకమాస ప్రత్యేక పూజలు అంగరంగవైభవంగా ప్రారంభం కానున్నాయి. లక్షపత్రి పూజలు, లక్ష దీపోత్సవం, లక్షవత్తు వేడుకలు నిర్వహించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల రోజు లపాటు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. నవంబరు 4, 11, 18, 25తేదీలలో సోమవారం సందర్భంగా ఉదయం శ్రీరాజరాజేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. మూడో సోమవారమైన నవంబరు 18మినహా మిగతా 3సోమవారాలలో మహాలింగార్చన నిర్వహిస్తారు. 18న మూడో సోమ వారం శ్రీభీమేశ్వరాలయంలో మహాలింగార్చన నిర్వహిస్తారు
2. ప్రముఖ పుణ్యక్షేత్రం, శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని ప్రధాన దేవాలయం మధుకేశ్వరుని ఆలయం, జీవేశ్వర, సోమేశ్వరాలయాలు కార్తీక మాసంలో నిర్వహించే పూజలకు సిద్ధమయ్యాయి. కార్తీక మాసం మొదటి రోజు మంగళవారంతో ప్రారంభం అవ్వడం ఈ ఏడాది నాలుగు సోమవారాలు ఉన్నాయని కార్యనిర్వాహణాధికారి ఎవీ రమణయ్య తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ క్యూలైన్ ఏర్పాట్లు, భక్తులకు నీడనిచ్చేందుకు పలు షామియానాలు ఏర్పాటు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, ఒడిశా నుండి భక్తులు ఎక్కువగా వస్తారు. ఈ క్షేత్ర మహాత్యం విన్నా, చదివినా ఎంతో మోక్షం లభిస్తుందని పూర్వీకుల హితోక్తి. ఈ క్షేత్రంలో సాక్షాత్తూ శివుడే ఉద్భవించారని చరిత్ర చెబుతోంది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన మధుకేశ్వరునితో పాటు సాక్షి గణపతులు గంగా, యమున, సరస్వతి ముఖద్వారం వద్ద చిత్రలేఖనంతో ఉంది. ఉత్తర భాగంలో వారాహి అమ్మవారు కొలువై ఉంటారు. గ్రామంలో ఎక్కడ చూసినా శివలింగాలే దర్శనమిస్తుంటాయి. ఆలయానికి ఉత్తర భాగంలో ఎతైన కొండలు, వెనుక భాగం దక్షిణ దిశలో గలగలా పారే వంశధార నది, చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు, తోటలతో పుణ్యక్షేత్రం పర్యాటకులకు ఆకట్టుకుంటుంది. సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో పచ్చని మొక్కలతో బృందావనం మాదిరిగా కన్పిస్తుంది. ఇక్కడ ప్రతీ సోమవారం కార్తీకమాసంలో పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆలయాన్ని దర్శించి పికినిక్‌లు కూడా జరుపుకుంటారు. ఆది, సోమ వారాల్లో ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాల పలు జిల్లాల నుండి వందల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శిస్తుంటారు. ఇంతటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మంగళవారం నుండి కార్తీక పూజలు ఘనంగా నిర్వహించడానికి ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆలయ ప్రాంగణంలోఅపురూప శిల్ప సంపదఆలయ ప్రాంగణంలో శతాబ్దాల క్రితం రాతియుగంలో చెక్కిన శిల్పాలు నేటికీ పర్యాటకులకు ఆకట్టుకుంటున్నాయి. ఈ అపురూప శిల్ప సంపదను తిలకించి దేశంలో ఎందరో మహానుభావులు మంత్ర ముగ్ధులయ్యారు
3.మేడారం జాతరకు రూ.75కోట్లు
దేశంలోనే అత్యధిక భక్తులు సందర్శించే సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్ల విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చిందని గిరిజన, మహిళా సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ఈ నిధులతో వేగంగా పనులు చేపట్టి భక్తులకు మెరుగైన సేవలు కల్పిస్తామని చెప్పారు.
4. నెమలి ఆలయంలో నరక చతుర్దశి వేడుకలు
గంపలగూడెం మండలంలోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం నరక చతుర్దశి వేడుకలను అర్చకులు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. నరకాసురున్ని వధించిన సంఘటన నేపథ్యంలో గుడిలో ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా నరక చతుర్దశి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రధానార్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం ఉదయం రాజ్యలక్ష్మి, గోదాదేవి, వేణుగోపాలస్వామి మూలవిరాట్టులకు అభిషేకాలు నిర్వహించింది. సాయంత్రం నరకాసురుని బొమ్మను దహనం చేసి, టపాసులు కాల్చారు. రాత్రికి ధనుర్బాణాలతో అలంకరించిన సత్యభామ, శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆశీనులను చేసి, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా నరక చతుర్దశి వేడుక ప్రాధాన్యతను అర్చకులు వివరించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
5. శ్రీశైలంలో నేటి నుంచి కార్తీకమాసోత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మంగళవారం నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. ఈ మాసంలో మొత్తం 20లక్షలమంది పైగా భక్తులు క్షేత్రాన్ని దర్శిస్తారని, రెండో శనివారం, ఆదివారం వంటి సెలవుదినాలు, సోమవారం, కార్తీకపౌర్ణమి మొదలైన రోజుల్లో లక్షమందికి పైగా వస్తారని ఈవో తెలిపారు.
6. శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించారు. జియ్యంగార్లు, అర్చకస్వాములు, ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి వద్ద ఈ కార్యక్రమం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా మలయప్పస్వామి, అమ్మవార్లు, విష్వక్సేనుల ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో వేంచేపు చేశారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించి నైవేద్యాలు నివేదించారు. నూతన పట్టు వస్ర్తాలను మూలవిరాట్టు, దేవతామూర్తులకు ధరింపజేసి రూపాయి, ప్రత్యేక హారతులు పట్టారు. అనంతరం తీర్థం, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే.. నాగులచవితి సందర్భంగా ఈనెల 31 రాత్రి 7-9 గంటల మధ్య మలయప్ప దేవేరులతో కలసి పెద్దశేష వాహనంపై చతుర్మాడ వీధుల్లో విహరిస్తారు.
7. సామర్లకోట – సామర్లకోట: పంచారామ క్షేత్రం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర ఆలయంలో తొలి కార్తీకమాస పూజలు ఘనంగా ప్రారంభమైనవి.తెల్లవారుజామున ప్రారంభమైన తొలి అభిషేకం పూజల్లో అన్నవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి గోత్రనామాలతో అర్చక బృందం పూజలు జరిపించారు.ఈ పూజల్లో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ దవులూరి దొరబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన దవులూరి దొరబాబు 108 సార్లు ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి నంది మండపంలో ఆలయ అర్చకలు సన్నిధి రాజు సుబ్బన్న సన్నిధి రాజు వెంకన్న చెరుకూరి రాంబాబు కొంతేటి జోగారావు లు వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ దవులూరి దొరబాబు మరియు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ నియోజకవర్గ నాయకులు సేపేని సురేష్ పట్టణ నాయకులు బొందల వెంకటరమణ గోకేడ రాజా ఎన్ శ్రీను తదితరులకు పండిత ఆశీర్వచనమందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పులి నారాయణ మూర్తి అసిస్టెంట్ భద్రరావు తదితరులు పాల్గొన్నారు.
8. పంచారామ క్షేత్రం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర ఆలయంలో తొలి కార్తీకమాస పూజలు ఘనంగా ప్రారంభమైనవి.తెల్లవారుజామున ప్రారంభమైన తొలి అభిషేకం పూజల్లో అన్నవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి గోత్రనామాలతో అర్చక బృందం పూజలు జరిపించారు.ఈ పూజల్లో పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ దవులూరి దొరబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన దవులూరి దొరబాబు 108 సార్లు ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి నంది మండపంలో ఆలయ అర్చకలు సన్నిధి రాజు సుబ్బన్న సన్నిధి రాజు వెంకన్న చెరుకూరి రాంబాబు కొంతేటి జోగారావు లు వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ దవులూరి దొరబాబు మరియు న
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ నియోజకవర్గ నాయకులు సేపేని సురేష్ పట్టణ నాయకులు బొందల వెంకటరమణ గోకేడ రాజా ఎన్ శ్రీను తదితరులకు పండిత ఆశీర్వచనమందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పులి నారాయణ మూర్తి అసిస్టెంట్ భద్రరావు తదితరులు పాల్గొన్నారు.
9. భగినీ హస్త.
భోజనం.
————————————–
కార్తీక మాసంలో శు”” విదియ. నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక. అన్నా చెల్లెలు పండుగ అంటారు. ఇది ఈ సంవత్సరం 29-10-2019 మంగళవారం వచ్చినది.
కారణం
.————-
సూర్య భగవానికి ఒక కుమారుడు ఒక కుమార్తె.
వారి పేర్లు “” యమధర్మరాజు & యమున. యమునకు అన్నగారు అనగా విపరీతమైన. అభిమానం.
అమె అన్నగారు ” యమధర్మరాజు”” గారిని ఎన్నో సార్లు తన ఇంటికి భోజనము నకు రమ్మని పిలిచేది. కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో పాపులను శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం చెల్లెలు కోరిక. తీర్చలేదని భాధపడేవాడు. కాలము గడచిపోతూఉంది. అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలు ఇంటికి వెళదామని అనకున్నాడు. ఆ రోజు కార్తీక శుద్ద విదియ
“‘ యమధర్మరాజు “” చెల్లెలి ఇంటి వచ్చాడు. రాక రాక వచ్చిన అన్నయ్య ను చూచి
చెల్లెలు “” యమున”” సంతోషంగా అన్నయ్య. కు ఇష్టమైన. పదార్థాలు వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. “” యమధర్మరాజు “” త్రుప్తిగా భోజనము చేసి చెల్లెలు తో ప్రేమగా చెల్లీ నాకు ఇషమైన పదార్థములు తో భోజనము పెట్టావు. నీకు ఏదైనా వరం ఇస్తానని చెప్పగా ” యమున” అన్నయ్యా లోకకల్యాణము కోసం నాకు ఒక వరము ఇవ్వు.
ఈ రోజు న ఎవరైనా అక్క& చెల్లెలు ఇంటికి ఏ అన్నయ్య & తమ్ముడు భోజనంచేస్తాడో నీవు ఎట్టి పరిస్థితి లో వారి జోలికి వెళ్ళవద్దు. ఇది నా కోరిక అనగా “” యమధర్మరాజు “”
లోకకల్యాణం కోసం అడిగావు కనుక ” తధాస్తు”
అని చెల్లెలు ను దీవించి వెళ్ళాడు. అనగా నేటి రోజున. అక్క & చెల్లెలు చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషములను ఉండవు.
10. శబరిమల యాత్ర కు వెళ్లు అయ్యప్పలకు, భక్తులకు దేవస్థానం వారి విజ్ఞప్తి…
1. ప్రైవేట్ వాహనాలు “నిలక్కల్”
వరకు మాత్రమే అనుమతి…
2. “నిలక్కళ్” నుండి “పంబ” వరకు కేరళ రాష్ట్ర RTC బస్సుల ద్వారా మాత్రమే ప్రయానించవలేను. ఆ బస్ లో కండక్టర్ ఉండరు. కావున కూపన్ కొని బస్ లో ప్రయానించవలెను.
3. మీరు పంబ చేరిన తర్వాత
త్రివేణి బ్రిడ్జి అయ్యప్ప వారధి
(కొత్తగా నిర్మించిన) మీదుగా
సర్వీస్ రోడ్డు ద్వారా కన్నిమూల
గణపతి ఆలయం చేరుకోవాలి.
4. పంబ నుండి కాలినడక వంతెన
మూసివేయబడింది
(గమనించగలరు).
5. త్రివేణి నుంచి “ఆరాట్టు కడావు”
వరకు గల ప్రదేశాలు మట్టి బురద
తో నిండి ప్రమాడపూరిటంగా
వున్నాయి కావున ఎవ్వరూ
క్రిందికి దిగరాదు.
6. పంబలో భక్తులకు కేటాయించిన
ప్రదేశాలలో మాత్రమే స్నానం
చేయాలి. మిగిలిన ప్రదేశాలలో
స్నానం చేయరాదు.
7. సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాలను
తప్పనసరిగా పాటించాలి. పంబ
పోలీసుస్టేషన్ ముందు ప్రదేశం
పూర్తిగా దెబ్బతింది.కావున ఆ
మార్గం గుండా కొండ పై కి
ఎక్కరాదు.
8. పంబ పెట్రోల్ బంక్ నుండి “u”
టర్నింగ్ పూర్తిగా దెబ్బతింది.
కావున ఆ ప్రాంతం పూర్తిగా
మూసివేయబడింది.
9. పంబ పరిసరాలు, అడవి దారిలో
ప్రమాదకరమైన “పాములు” బాగా
సంచరిస్తున్నందువల్ల జాగ్రత్త గా
వుండాలి.
10. అనుమతి లేని దారుల ద్వారా
కొండ ఎక్కరాధు.
11. త్రాగు నీటిని వెంట తీసుకెళ్లాలి.

12.ప్లాస్టిక్ వస్తువులను వాడరాదు
13. భోజనం, టిఫిన్స్ స్టాల్ నీలక్కల్
లో కలవు.
14. ఇరుముడి లో ప్లాస్టిక్
కవర్లు,వస్తువులు ఉండరాదు
15. మీ కు అవసరమైన కొద్దిపాటి
తినుబండారాల తెచ్చుకోవాలి
16. మంచినీటి కొరత వల్ల నీటిని
వృదాచేయరాధు ( నీటి పైపు
లు పాడైన కారణంగా).
17. ఇటీవల వరదల కారణంగా
నీలక్కళ్. పంబ. సన్నిధానం
ప్రాంతాల్లో మరుగుదొడ్లు
పాడైపోవటం వల్ల నియమిత
మరుగుదొడ్ల ను వాడుకోవాలి.
పైన చెప్పినవన్నీ devaswom board వారి ఉత్తర్వుల ను అందరూ పాటించి స్వామి అయ్యప్ప వారి క్షేత్రం లో క్రమశిక్షణ తో ప్రయాణించి స్వామి అయ్యప్ప వారి కృపా కటాక్షాన్ని పొందగలరు…
| స్వామియే శరణం అయ్యప్ప ||
*|| ఓం నమః శివాయ ||*a
11. శ్రీశైలం ఈరోజు నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభంకార్తీక మాసంలో శ్రీశైలానికి 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా: దేవస్థానం ఈఓ రామారావుభక్తులకు సరిపడ లడ్డు, ప్రసాదాలు, క్యూలైన్లలో వేడిపాలు, అల్పాహారం, మంచి నీరు పంపిణీ: దేవస్థానం ఈఓకార్తీక మాసంలో భక్తులకు సేవలందించేందుకు ఉద్యోగులందరికి ప్రత్యేక విధులు : దేవస్థానం ఈఓరద్దీ రోజుల్లో సుప్రభాత సేవ, మహా మంగళ హారతి సేవల టిక్కెట్లు నిలుపుదల :దేవస్థానం ఈఓ
12. ఇంద్రకీలాద్రి గాజుల మహోత్సవానికి ముస్తాబవుతోంది.
ఏటా దుర్గమ్మను, ఆలయ ప్రాంగణాన్ని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
2016 నుంచి ప్రారంభించిన ఈ వేడుకను..తొలి ఏడాది కేవలం 5 లక్షల గాజులతో ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది కోటి గాజుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి గాజుల అలంకరణకు అవసరమైన కొన్ని గాజులను దేవస్థానం కొనుగోలు చేస్తుంది. భక్తుల నుంచి కూడా భారీ స్థాయిలో గాజులు విరాళంగా దేవస్థానానికి అందాయి.
13. శుభమస్తు _ నేటి పంచాంగం
తేది : 29, అక్టోబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
వారము : మంగళవారం
క్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(ఈరోజు ఉదయం 7 గం॥ 33 ని॥ వరకు)
విదియ :-రా.1-54ని
క్షత్రం : విశాఖ
(ఈరోజు రాత్రి 1గం॥ 54 ని॥ వరకు)
యోగము : ఆయుష్మాన్
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 8 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 47 ని॥ వరకు)
పున.రా.తె.5-48 మొ
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 12 ని॥ వరకు)(రాత్రి 10 గం॥ 48 ని॥ నుంచి 11 గం॥ 56 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 3 గం॥ 00 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 30 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 25 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 32 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 13 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 46 ని॥ లకు
14. చరిత్రలో ఈ రోజు 29, అక్టోబరు
సంఘటనలు
1963: స్టా ఆఫ్ ఇండియాతో సహా ఎన్నో విలువైన రత్నాలు న్యూయార్కు లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి.
1971: తుపాను తాకిడికి ఒడిషాలో 10, 000 మంది మరణించారు.
1989 : విజయవాడలో మొదటి పుస్తక ప్రదర్శననిర్వహించారు
1996: ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియంతో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ తమిళనాడు లోని కల్పక్కంలో పని చెయ్యడం ప్రారంభమయింది.
2005: తెలంగాణలో నల్గొండ దగ్గరి వలిగొండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రేపల్లె, సికిందరాబాదు డెల్టా పాసెంజరు యొక్క ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా.ఢిల్లీలో జరిగిన మూడు వరుస పేలుళ్ళలో 70 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. ఒక బస్సులో ఉంచిన పేలుడు పదార్ధాలను గుర్తించిన డ్రైవరు, కండక్టరు వాటిని బయటకు విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది.
2007: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 20, 000 దాటి రికార్డు సృష్టించింది.
2013: బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు మరణించారు
జననాలు
1017: హెన్రీ III, రోమన్ చక్రవర్తి.
1899: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (మ.1978)
1950: తవజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత.
1961: ణిదల నాగేంద్రబాబు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.
1981:రీమాన్,భారతీయ సినిమా నటి.
మరణాలు
1940: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1863)
1953: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. (జ.1906)
15. విశాఖపట్నంశబరిమల యాత్రికుల కోసం విశాఖ-కొల్లాం మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
నవంబరు 17 నుంచి జనవరి 19 వరకు 10 ట్రిప్పులు తిరగనుందీ రైలు.
17 నుంచి ప్రతి ఆదివారం విశాఖలో ఈ ప్రత్యేక రైలు బయలుదేరనుంది.
19 నుంచి ప్రతీ మంగళవారం కొల్లాంలో బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
16. రాశిఫలం -29/10/2019
తిథి:
శుద్ధ పాడ్యమి ఉ.7.18 త.విదియ రా.తె.5.42, కలియుగం-5121 , శాలివాహన శకం-1941
నక్షత్రం:
విశాఖ రా.1.40
వర్జ్యం:
ఉ.8.00 నుండి 9.32 వరకు, తిరిగి రా.తె.5.33 నుండి
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు తీవిశేషాలు: బలిపాడ్యమి, ఆకాశదీపవ్రతారంభం, యమద్వితీయ, భగినీహస్త్భోజనం
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
వృషభం
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అకాల భోజనాదులవల్ల అనారోగ్యమేర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో నుండుట అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. క్రొత్త పనులు ప్రారంభించరాదు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుండును. క్రొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగివుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశముంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా నుండుట అవసరం.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతోపాటు ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు. స్ర్తిలు, బంధు, మిత్రులను కలుస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యల నెదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలనమేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు
17. కార్తీక పురాణం 2వ అధ్యాయం -. సోమవార వ్రత మహిమ
వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి.
**ఉదయం నదీస్నానమాచరించాలి.
నువ్వులను దానం చేయాలి (తిలాదానం).తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత, తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.
**కుక్క కైలాసానికి వెళ్లుట…
”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది.అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది.పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసిన పాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది.యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కంఉబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.
కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెనుకొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”ఇతి శ్రీ సాంద పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.
18. స్త్రీ వైశిష్ట్యం – 14
గాంధారికి బహుసంతానవతి అని వరముంది. ఆమెకు సంతానాపేక్ష ఎక్కువే అయినా భర్త, సంతానం అంతా ధర్మం తప్పి ప్రవర్తించినా తాను మాత్రం ధర్మపక్షపాతియై ధర్మం విషయంలో ఎక్కడా ఆమె వెనుకంజ వేయకుండా మాట్లాడగలిగిన స్థితిని పొందింది. ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి‘నాకు విజయం కలగాలి’ అని ఆశీర్వచనం చేయమన్నాడు. ఆమె మాత్రం నిర్మొహమాటంగా..‘‘ ధర్మం ఎక్కడుంటుందో అక్కడే విజయం. నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు. ఆయనకు వశవర్తియై ప్రవర్తించు. అప్పుడు ధర్మాన్ని నీవు పొందుతావు. దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు తప్ప నీవు అధర్మాన్ని పట్టుకుని గెలవలేవు సుయోధనా…’’అంది. కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి చూసినప్పుడు కొడుకులందరూ మరణించి ఉన్నారు.అందునా దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలయి పడిపోతే….ఆమె కోపం అటుతిరిగి ఇటు తిరిగి ఎవరిమీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్రవ్యామోహాన్ని పొంది కృష్ణుడి వంక చూసి అంది..‘‘అన్నీ నీకు తెలుసు కృష్ణా, వీరందరూ మరణిస్తారని తెలుసు. నువ్వే పూనుకుని ఉంటే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు. దీనికంతటికీ కారణం కృష్ణా నువ్వే… నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకుని నశించి పోయెదరు గాక.. కొన్ని సంవత్సరాల తరువాత నువ్వు కూడా దిక్కులేని చావు చచ్చెదవుగాక’’ అని శపించింది. దానికి కృష్ణుడు నవ్వి ‘‘అమ్మా! ధర్మానికి వంతపాడినందుకు నాకు నువ్విచ్చే కానుకా ఇది..!!!’’ అన్నాడు. ఆ మాటతో ఇంతటి మహోన్నతమైన గాంధారి కూడా కుంచించుకు పోయింది.ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకుని మడిసిపోయిన నూరుగురు కొడుకులను చూసుకుని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడూ కూడా బతకలేదు కదా… ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయారా.. అని వ్యాకులత చెంది కుంతిబిడ్డల పంచనజేరి జీవితం గడుపుతూ, భీముడనే మాటలు వినలేక ధతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయి అక్కడ దావాగ్నిలో శరీరాన్ని విడిచి పెట్టేసింది. అలాగే కుంతీదేవి. ఆమె కుంతిభోజుని కుమార్తె కాదు, శూరసేనుడి కుమార్తె. అందుకే శ్రీ కృష్ణుడికి మేనత్త, వసుదేవునికి చెల్లెలు. అసలు తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతిభోజుడు పెంచుకున్నాడు. కాబట్టి కుంతీదేవి అయింది. భారతం చదివితే ఆమెలో ఎన్ని ఉత్థానపతనాలు, ఎంత సహనం, ఎన్ని గొప్ప లక్షణాలు… ఆశ్చర్యమేస్తుంది. అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారు ఎవరి క్షేమసమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నారో తెలుసా? కుంతీదేవిని గురించి. అంతటి భీష్ముడు ఒకమాటన్నారు– ‘‘అసలు ఆ కుంతీదేవిలాంటి స్త్రీ లోకంలో ఉంటుందా? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో, మహా ఔన్నత్యం కల తల్లి’’ – అన్నారు.
**అనురాగ పర్వం
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తన చెల్లెలు యమున ఇంటికి యమధర్మరాజు భోజనానికి వెళ్ళాడు. ఆ రోజు కార్తిక శుద్ధ విదియ. అన్నగారి రాకతో పొంగిపోయిన యమున- ఆయనతోపాటు వచ్చిన చిత్రగుప్తుడికి, యమదూతలకు సైతం సాదరంగా స్వాగతం పలికింది. సకల మర్యాదలూ చేసింది. తానే స్వయంగా పిండివంటలతో చక్కని భోజనం సిద్ధంచేసింది. ప్రేమగా వడ్డించింది. ఆత్మీయంగా తినిపించింది. యముడికి చాలా సంతోషం కలిగింది. ఏటా ఇలా కార్తిక శుక్ల విదియ రోజు అక్కాచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి తృప్తిగా ఆరగించే సోదరులకు- అకాల మృత్యుభయం, నరకప్రాప్తి రెండూ ఉండవని వరం ఇచ్చాడు. సోదరి చేతివంటకు ఇంతటి పురాణ ప్రాశస్త్యం ఏర్పడిన రోజును ‘యమద్వితీయ’గా నిర్ణయించిన స్మృతికౌస్తుభం(వ్రత గ్రంథం)- భగినీ హస్తభోజనాన్ని ఆనాటి ముఖ్యమైన వేడుకగా ప్రచారంలోకి తెచ్చింది.ఈ కథ ద్వారా అన్నం వండేది గంజి కోసం కాదు- మెతుకు కోసం! మనకు పరిచయం కావలసింది- యమధర్మరాజుతోనో, ఆయన చెల్లెలు యమునతోనో కాదు… తోబుట్టువుల మధ్య అద్భుతమైన, అపురూపమైన అనురాగ బంధం గురించి మనకు తెలియాలి. అది మనసుకు హత్తుకోవాలని పెద్దలు ఈ కథ చెప్పారు. అలా చేస్తే నరకం తప్పుతుందని తాయిలం ఆశ పెట్టారు. దాన్నొక ఆచారంగా చూపెట్టారు. మనం గుర్తించవలసింది, గుర్తుపెట్టుకోవలసింది, ఆ కథల్ని కాదు- మన గుండెల మీద వాటి ముద్రల్ని! అవే మన ఆచారాల అసలు లక్ష్యం.వస్త్రాపహరణ ఘట్టంలో ‘అన్నా’ అని ఎలుగెత్తి పిలిచింది ద్రౌపది. కొండంత దుఃఖంలోంచి, గుండె లోతుల్లోంచి పెల్లుబికిన ‘కృష్ణా’ అన్న పెనుకేక అన్నగా దిగివచ్చిన దేవుణ్ని సూటిగా తాకింది. ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు, ఆమె హృదయంలోనే ఉన్నాడు. ఆపైన కృష్ణ అనే సంబోధన కృష్ణుడికే కాదు, ద్రౌపదికీ వర్తిస్తుంది. అది ఆ అన్నాచెల్లెళ్ల దగ్గరతనానికి గుర్తు. వారిద్దరి అనుబంధానికి ఆనవాలు.వేళకానివేళ వేలమంది శిష్యులతో దుర్వాస మహర్షి పరీక్షించడానికై వచ్చి అన్నం పెట్టమని అడిగిన వేళ, ద్రౌపది మనసారా తలచుకున్నది- అన్నగారినే. ఆయనా అంతే! హస్తినకు రాయబారిగా వెళ్లినప్పుడు పంచ పాండవుల అభిప్రాయాల కన్నా, పాంచాలి ఆవేదనకే శ్రీకృష్ణుడు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.కృష్ణుడు ద్రౌపదికి తోడబుట్టినవాడు కాడు. వరసకు మాత్రమే అన్న. అయినా వారిద్దరి మధ్య ఆత్మీయ అనుబంధం ఈ లోకానికి పాఠ్యగ్రంథమై నిలిచింది. మహాభారతం అంతటా ఎన్నో సన్నివేశాలతో అది అనుబంధ సుగంధమై పరిమళాలు వెదజల్లింది. ఆప్యాయతనే కాదు, ఒకరి పట్ల ఒకరికి గల మర్యాదనూ ప్రతిబింబించింది.పురాణాల్లో మహర్షులతోపాటు ప్రబంధాల్లో మహాకవులు సైతం కుటుంబ జీవనానికి సంబంధించిన మమతానురాగాలను అమోఘంగా వర్ణించారు. తెనాలి రామకృష్ణుడి పాండురంగ మాహాత్మ్యంలో చెడు తిరుగుళ్లకు అలవాటుపడిన నిగమశర్మను అతడి సోదరి దారికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు మనల్ని కంటతడి పెట్టిస్తాయి.జన్మనిచ్చిన తల్లి, తోడబుట్టిన ఆడపడుచు, కనిపెంచిన కూతురు… ఈ ముగ్గురూ పురుషుడికి దేవుడిచ్చిన తల్లులు. కొద్దిపాళ్లు కాస్త అటూ ఇటూగా వారు వరసగా మగవాణ్ని లాలిస్తారు, ప్రేమిస్తారు, శాసిస్తారు. ఒక వంశానికి చెందిన సంస్కృతీ సంప్రదాయాలు, తమ కుటుంబ ఆచార వ్యవహారాల రూపంలో నిక్షిప్తం అయ్యేది వారిలోనే. ఆ ముగ్గురే వాటికి అధికార ప్రతినిధులు. వారే నిలువెత్తు దర్పణాలు. కుటుంబ నిర్వహణ, వ్యవహార దక్షత వంటి స్త్రీ సహజ చాతుర్యాలు తల్లి నుంచి కూతురికి సంక్రమిస్తాయి. అవి బాగుంటే ‘పెంపకం బాగుంది’ అని లోకం హర్షిస్తుంది. అలా ఒకానొక పరంపరకు, కుటుంబ మర్యాదకు అసలు సిసలు వారసులైన స్త్రీ జాతితో పురుషుడు ఎలా వ్యవహరించాలో చెప్పేందుకే ఈ యమద్వితీయలు, భ్రాతృ విదియలు. మనకు పండుగలన్నీ పాఠాలే!