ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) క్యాన్సస్ లో కోటి రాగాలు పేరుతో మ్యూజికల్ నైట్ నిర్వహించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగువారి కోసం నాట్స్ ఈ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసింది. తెలుగు ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ మ్యూజికల్ నైట్ తన పాటలతో అలరించారు. క్యాన్సస్ నాట్స్ ఛాప్టర్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి, క్యాన్సస్ నాట్స్ చాప్టర్ సెక్రటరీ వెంకట్ మంత్రి నేతృత్వంలో నాట్స్ చేపట్టిన ఈ మ్యూజికల్ నైట్ ఆహ్లాదంగా సాగింది. నాట్స్ సేవా కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఈ సందర్భంగా వివరించారు. నాట్స్ చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి తెలుగువారి నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. నాట్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాల గురించి మంచికలపూడి వివరించారు. అనంతరం సంగీత దర్శకుడు కోటి, గాయనీ, గాయకులు సుమంగళి, శ్రీకాంత్ సండుగు, ప్రసాద్ సింహాద్రి తదితరులను నాట్స్ ఘనంగా సత్కరించింది.
కాన్సాస్లో నాట్స్-కోటి సంగీత విభావరి
Related tags :